JEE Main 2026 Results: ఇవాళే జేఈఈ మెయిన్ 2026 ఫలితాలు.. మీ స్కోర్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
ఇంజనీరింగ్ విద్యార్థుల నిరీక్షణకు ఇవాళ తెరపడనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం JEE మెయిన్ 2026 సెషన్-1 ఫలితాలను అధికారికంగా విడుదల చేయనుంది. జనవరి 21 నుండి జనవరి 29 వరకు జరిగిన ఈ ప్రతిష్టాత్మక పరీక్షా ఫలితాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభ్యర్థులు తమ ఫలితాలను, స్కోర్ కార్డ్‌లను నేరుగా అధికారిక వెబ్‌సైట్‌ల నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. jeemain.nta.nic.in, nta.ac.in వెబ్‌సైట్ల ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. డౌన్‌లోడ్ ప్రక్రియ వెబ్‌సైట్‌ను…
