తగ్గేదేలే.. పందెంలో కొత్త ఒరవడి.. మేము సైతం అంటూ బరిలోకి దిగుతున్న మహిళామణులు..!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. ఈ పందేలను చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో బరుల దగ్గర పందెం రాయుళ్లు, వీక్షకులతో సందడి వాతావరణం నెలకొంది. బరుల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. గతంలో లాగే ఈ సారీ కూడా కోట్ల రూపాయలు…
