పసిడి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల తగ్గినట్లే తగ్గి ఊరటనిచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ముఖ్యంగా.. ఇరాన్-అమెరికా యుద్ధం, అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు.. తదితర పరిణామాల వల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా.. తాజాగా కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.. పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా గురువారం ఆగస్టు 6 ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధరపై రూ.10 మేర పెరిగి.. రూ.1,45,760 గా ఉంది.
22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.10 మేర పెరిగి రూ.1,33,610 గా ఉంది.
వెండి కిలో ధరపై రూ.100 మేర పెరిగి.. రూ.2,40,100 లుగా కొనసాగుతోంది.
అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం10 గ్రాముల ధర రూ.1,45,760, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,33,610 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,40,100 ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,45,760, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,33,610 ఉంది. వెండి కిలో ధర రూ.2,40,100 ఉంది.
