తాజావార్తలు

అవును.. ఇంగ్లాండ్‌లో చెత్తగా ఆడాం, కానీ! జింబాబ్వేతో సిరీస్‌కి ముందు కెప్టెన్ అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అవును.. ఇంగ్లాండ్‌లో చెత్తగా ఆడాం, కానీ! జింబాబ్వేతో సిరీస్‌కి ముందు కెప్టెన్ అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్


పసికూన జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని యంగ్ టీమిండియా జింబాబ్వేకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నెల 23న తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే ఈ తొలి మ్యాచ్‌కి ముందు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మీడియా సమావేశంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జింబాబ్వే పర్యటనకు రావడం తనకు తొలిసారి అని, అంతా చాలా బాగుందని అన్నాడు.

అలాగే మాట్లాడుతూ.. ఇంగ్లాండ్‌తో తమ ప్రదర్శన అంత బాగా లేదని, కానీ ఆ ఓటముల నుంచి చాలా పాజిటివ్ విషయాలు నేర్చుకున్నాం అంటూ అయ్యర్ పేర్కొన్నాడు. జట్టులో చాలా మంది ఆటగాళ్లకు ఇదే తొలి జింబాబ్వే పర్యటన అని అన్నాడు. వారు వీలైనంత త్వరగా ఇక్కడ పరిస్థితులకు అలవాటు పడతారని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఈ నెల 23 నుంచి హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు కూడా అదే వేదికపై జరగనున్నాయి. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని యువ భారత జట్టు ఈ సిరీస్‌లో విజయాలతో ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇంగ్లాండ్ పర్యటనలో పాల్గొన్న శ్రేయస్ అయ్యర్‌తో పాటు పలువురు ఆటగాళ్లు నేరుగా హరారేకు చేరుకోగా, మిగతా సభ్యులు తాత్కాలిక ప్రధాన కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో భారత్ నుంచి జింబాబ్వేకు వెళ్లారు. ఈ సిరీస్‌లో తొలి టీ20 జూలై 23న హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కానుంది. రెండో టీ20 జూలై 25న, మూడో టీ20 జూలై 26న అదే గ్రౌండ్‌లో సేమ్ టైమ్‌కి ప్రారంభం కానుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *