ఫుల్ టైం ఐటీ రిక్రూటర్.. పార్ట్ టైం ఈ గలీజ్ దందా..!
పండుగ పూట పోలీసులు పెద్దగా పట్టించుకోరు అనుకున్నారేమో.. బహిరంగంగానే గబ్బు పనికి పూనుకున్నారు. కానీ, పోలీసులు వారి ఆట కట్టించి.. కటకటాల్లోకి నెట్టారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు డ్రగ్స్ విక్రయానికి యత్నించిన ఇద్దరిని బుధవారం (జనవరి 14) అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.లక్ష విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయినవారిని రాజేంద్రనగర్‌కు చెందిన అన్వర్ హుస్సేన్ (33), బండ్లగూడ జాగీర్‌కు చెందిన బుర్ర సంపత్ (31)గా పోలీసులు గుర్తించారు. అన్వర్…
