New WhatsApp: కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్.. ఇక డ్రైవింగ్ చేస్తూనే కాల్స్, మెసేజ్‌లు సులభంగా!
New WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం, ముఖ్యంగా కార్లలో ప్రయాణించే వారి కోసం ఒక సరికొత్త యాప్‌ను లాంచ్ చేసింది. ఇప్పటివరకు కేవలం మెసేజ్‌లకే పరిమితమైన ‘కార్ ప్లే’ (CarPlay) సదుపాయం, ఇప్పుడు పూర్తి స్థాయి యాప్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ తాకకుండానే వాట్సాప్ ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. ఏమిటీ కొత్త మార్పు? సాధారణంగా ఆపిల్ ఐఫోన్ వినియోగదారులు తమ ఫోన్‌ను కారు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు కనెక్ట్…
