JEE Main 2026 Answer Key: జేఈఈ మెయిన్ ఆన్సర్ కీలో ఏకంగా 17 తప్పులు.. నోరు విప్పని ఎన్టీయే!
హైదరాబాద్, ఫిబ్రవరి 10: జేఈఈ మెయిన్ 2026 తొలి సెషన్ పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసిన కీపై చాలా తప్పులు ఉన్నాయంటే విమర్శలు వస్తున్నాయి. ది కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీఎఫ్‌ఐ) స్పందిస్తూ ఆన్సర్ కీలో తప్పులను ఎత్తి చూపారు. ఈ తప్పులు విద్యార్థుల ర్యాంకులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. మొత్తం 17 ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా…
