తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో హస్తం హవా.. పదుల సంఖ్యలో హంగ్ పరిస్థితులు..
తెలంగాణలో మున్సిపల్ పోరు ముగిసింది. కొన్ని కార్పొరేషన్లు మినహా ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తయినట్లే. కొన్నిచోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్… మరికొన్నిచోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్‌ఎస్.. ముక్కోణపు పోటీ నడిచింది. టోటల్‌గా అధికారపార్టీకి అనుకూలంగా వచ్చింది పట్టణ ఓటరు తీర్పు. మొత్తం 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగితే, అందులో కాంగ్రెస్ 68, బీఆర్ఎస్ 14 చోట్ల గెలిస్తే, 33 మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలకు సమానమైన సీట్లొచ్చి హంగ్ ఏర్పడింది. గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో…
