శ్రీ వెంకటేశ్వరుడి క్షేత్రాన్ని కాపాడేది ఎవరు? తిరుమల క్షేత్రపాలకుడికి రుద్రాభిషేకం సీక్రెట్ ఇదే..!
కలియుగంలో భక్తులకు ప్రత్యక్ష దైవంగా భావించబడే శ్రీ వేంకటేశ్వర స్వామి వెలసిన పవిత్ర స్థలం తిరుమల. ఈ పుణ్యక్షేత్రం “కలియుగ వైకుంఠం”గా విశేష ఖ్యాతిని పొందింది. ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ప్రతి రోజు ఈ పవిత్ర క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ తమ జీవితాలను ధన్యంగా భావిస్తారు. “నిత్యకళ్యాణం పచ్చతోరణం” అనే మాటకు సాక్ష్యంగా, ఈ క్షేత్రంలో ఎల్లప్పుడూ మంగళకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. భక్తుల నమ్మకాల ప్రకారం ఇక్కడ జరిగే ప్రతి…
