సీబీఎస్సీ OSMపై విద్యార్ధులు, తల్లిదండ్రుల్లో ఆందోళన.. రంగంలోకి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్!
న్యూఢిల్లీ, మే 24: సీబీఎస్ఈ రీవాల్యుయేషన్ ప్రక్రియ దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. పునఃమూల్యాంకన ప్రక్రియలో తలెత్తి సాంకేతిక అంతరాయాలపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్రంగా పరిగణించారు. సర్వర్ డౌన్‌టైమ్, పేమెంట్ గేట్‌వే లోపాలు, కార్యాచరణ వైఫల్యాలపై సవివరమైన నివేదికను కోరుతూ సీబీఎస్సీకి ఉత్తర్వులు జారీ చేశారు. సాంకేతిక వైఫల్యాలకు గల కారణాలు, తీసుకున్న సన్నద్ధతా చర్యలతోసహా ఈ ప్రక్రియ నిర్వహణలో పాలుపంచుకున్న ఏజెన్సీల…
