
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లకు 205-3 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన ఆర్సీబీ సులువుగా లక్ష్యాన్ని చేధించింది. 18.5 ఓవర్లలోనే 206-5 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 44 బాల్స్‌కు 81, దేవదత్ పడిక్కల్ 27 బాల్స్‌కు 55 పరుగులు చేసి ఆర్సీబీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు నుంచి సాయి సుదర్శన్ 58 బాల్స్‌కు సెంచరీ చేసి మంచి స్కోర్ అందించాడు. అయితే గుజరాత్ ఓటమి పాలవ్వడంతో అతడి సెంచరీ వృథా అయినట్లు అయింది.
