PM Modi: యుద్ధం సమస్యలకు పరిష్కారం కాదు.. చర్చలు, దౌత్యమే మార్గం: ప్రధాని మోదీ
ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ సమస్యలకు యుద్ధం ఒక్కటే పరిష్కారం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. చట్ట పరిపాలన, పరస్పర చర్చలు, దౌత్యపరమైన ప్రయత్నాల ద్వారానే వివాదాలకు శాంతియుత పరిష్కారం సాధ్యమని పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, ఫిన్లాండ్ దేశాలు రెండూ కూడా చట్ట పరిపాలన, చర్చలు, దౌత్యానికి ప్రాధాన్యం ఇస్తాయని మోదీ తెలిపారు. యుద్ధం…
