Talliki Vandanam: ‘తల్లికి వందనం’ రావడం లేదా..? ఏపీ ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన.. వారికి కూడా ఆర్ధిక సాయం
తల్లికి వందనం పథకంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 67,01,653 మంది విద్యార్థులకు రూ.8,454 కోట్ల మేర సాయం అందించినట్లు ప్రకటించారు. అర్హులందరికీ సాయం అందించాలనేది ప్రజా ప్రభుత్వ నిర్ణయమని తెలిపారు. తల్లికి వందనం పథకం, యూడైస్ ప్రకారం రాష్ట్రంలో నమోదైన విద్యార్థుల సంఖ్యపై శాసనమండలిలో వైసీపీ సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి మంత్రి సమాధానం ఇస్తూ.. యూడైస్ ప్రకారం ఒకటో తరగతి నుంచి 12వ తరగతి…
