గోవిందరాజ స్వామి ఆలయ గోపురం పైకెక్కిన వ్యక్తి
తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో అర్ధరాత్రి వేళ మందుబాబు హాల్‌చల్ చేశాడు. స్వామివారి ఏకాంత సేవ అనంతరం ఆలయం మూసివేసిన తర్వాత విజిలెన్స్ సిబ్బంది కళ్ళు కప్పి మహాద్వారం గుండా లోనికి ప్రవేశించి ఆలయ గోపురం పైకెక్కి నానా హంగామా చేశాడు. అక్కడున్న కలశాలు, విద్యుత్ దీపాలు స్వల్పంగా ధ్వంసం చేశాడు. మద్యం మత్తులో ఉన్న అతను ఆలయ గోపురం పైకెక్కి తాను కిందికి దిగాలంటే మద్యం బాటిల్ ఇవ్వాలంటూ…
