ఈశ్వర్ చిత్రంతో ప్రభాస్ చిత్రసీమలోకి అడుగుపెట్టినప్పటి రోజులను నటుడు కృష్ణ మాయ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అప్పట్లో ప్రభాస్ అమాయకత్వం, అంకితభావం, అలాగే సిగ్గుపడే స్వభావం వంటి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాలు, ముద్దు సీన్ల చిత్రీకరణ సమయంలో ప్రభాస్ సిగ్గుపడటం తరచుగా జరిగేదని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో డిజిటల్ కెమెరాలు లేకపోవడం, ఫిల్మ్ వాడకం చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి “వన్ మోర్” షాట్ అడిగే సందర్భాలు తక్కువగా ఉండేవని కృష్ణ మాయ వివరించారు. అయినప్పటికీ, ప్రభాస్ తన నటనపై ఎంత శ్రద్ధ పెట్టేవారంటే, ఒకసారి “వన్ మోర్” సార్ అని అడిగేవారని చెప్పారు. “ఏయ్ బాగుంది, బాగుంది” అని చెప్పి మానిటర్ కూడా చూసుకోకుండానే తదుపరి పనికి వెళ్ళిపోవాల్సి వచ్చేదని పేర్కొన్నారు. స్కూల్ దగ్గర షూటింగ్ జరుగుతున్నప్పుడు, చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు గుమిగూడినప్పుడు ప్రభాస్ ఎంతగా సిగ్గుపడేవాడో కృష్ణ మాయ ఉదాహరణగా చెప్పారు. శ్రీదేవి సైకిల్ మీద వచ్చి పడిన సన్నివేశంలో, ఆమెను గట్టిగా కౌగిలించుకోవడానికి కూడా సిగ్గుపడ్డాడని, డైరెక్టర్ ప్రోత్సాహంతో ఆ సన్నివేశాన్ని పూర్తి చేశాడని ఆయన తెలిపారు. అప్పట్లో ఆ అమాయకత్వమే ప్రజలకు నచ్చిందని, అది అతని ఎదుగుదలకు ఒక కారణమని కృష్ణ మాయ తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్‌కు లభించిన స్టార్డమ్, గుర్తింపు గురించి ప్రస్తావిస్తూ, అటువంటి స్థాయి ఉన్నప్పటికీ ప్రభాస్‌లో గర్వం ఎక్కడా కనిపించదని కృష్ణ మాయ పేర్కొన్నారు. తనకు ప్రైవసీ దొరకని స్థాయికి ఎదిగినప్పటికీ, తన స్నేహితుల పట్ల, సహనటుల పట్ల ఆయన చూపించే ఆదరణ అపారమైనదని చెప్పారు. తన జిమ్ ట్రైనర్ లక్ష్మణ్‌కు కోటి రూపాయల విలువైన రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇవ్వడం వంటి అనేక సహాయాలు ప్రభాస్ నిశ్శబ్దంగా చేస్తారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈశ్వర్ సినిమాలో నటించిన కొందరు వ్యక్తుల గురించి కూడా కృష్ణ మాయ ప్రస్తావించారు. పులి రాంబాబు అనే నటుడు, రోజుకు 15,000 రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నప్పటికీ, చెడు అలవాట్లకు బానిసలై అనారోగ్యంతో మరణించారని చెప్పారు. అదేవిధంగా, అదృష్టం కలిసొచ్చి జబర్దస్త్ ద్వారా ప్రముఖుడైన అదిరే అభి, అలాగే హను కోట్లా వంటి వారు మంచి ప్రొఫెషన్లలో స్థిరపడ్డారని వివరించారు. హను కోట్లా ఇప్పుడు JNTUలో డీన్‌గా పనిచేస్తున్నారని తెలిపారు.
ప్రభాస్ తన కెరీర్ ప్రారంభంలో ఎలా కష్టపడ్డారో కృష్ణ మాయ వ్యక్తిగత అనుభవాల ద్వారా పంచుకున్నారు. కృష్ణానగర్‌లో కెమెరామెన్ జవహర్ రెడ్డి, ప్రభాస్, కృష్ణ మాయ ముగ్గురూ కలిసి డెమో షూట్స్ కోసం తిరిగేవారని, అప్పట్లో ప్రభాస్‌ను “కొత్త కుర్రోడు సీరియల్ ట్రై చేస్తున్నాడు” అని చెప్పేవారని కృష్ణ మాయ నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. కృష్ణంరాజు గారి అబ్బాయి అని చెప్పడం అనవసరం అని భావించేవారని, అది ప్రభాస్‌కు కూడా నచ్చేదని అన్నారు. ఈశ్వర్ ప్రివ్యూ చూసిన తర్వాతే ప్రభాస్ ఒక గొప్ప హీరో అవుతాడు అనే నమ్మకం అందరికీ కలిగిందని కృష్ణ మాయ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ఎక్కువమంది చదివినవి : RRR Movie : అబ్బబ్బా.. ఏం మారింది భయ్యా.. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లీని చూశారా.. ? అచ్చం హీరోయిన్‌లాగే ఉందిగా..
