తాజావార్తలు

Hyderabad: అమ్మలేని లోకంలో తాను ఉండలేనని.. తనయుడి షాకింగ్ నిర్ణయం!

Hyderabad: అమ్మలేని లోకంలో తాను ఉండలేనని.. తనయుడి షాకింగ్ నిర్ణయం!


Hyderabad: అమ్మలేని లోకంలో తాను ఉండలేనని.. తనయుడి షాకింగ్ నిర్ణయం!

హైదరాబాద్‌, మే 28: తల్లి మరణించి 2 నెలలు కూడా తిరక్కుండానే ఆ ఇంట మరో మరణం కలవరం రేపింది. తల్లి మరణం జీర్ణించుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకరిని వీడి ఒకరు ఉండలేక వరుసగా తల్లీకుమారుడు మరణించారు. ఈ హృదయవిదారక ఘటన హైదరాబాద్‌లోని మార్కండేయ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

హైదరాబాద్‌లోని మైలార్‌దేవపల్లి ప్రాంతంలోని నివాసం ఉంటున్న కొముర రెడ్డి ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడి తల్లి సుమారు రెండు నెలల క్రితం చనిపోంది. అప్పటి నుండి కొముర రెడ్డి మానసికంగా కుంగిపోయాడు. ఆ విషాదం తర్వాత అతను మద్యంకి బానిసయ్యాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఈ క్రమంలో బుధవారం (మే 27) తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో కొముర రెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న మైలార్‌దేవపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ జరుగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *