తాజావార్తలు

ప్రధాని మోదీ, అమిత్ షా పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సిగ్గుచేటు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

ప్రధాని మోదీ, అమిత్ షా పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సిగ్గుచేటు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి


ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని.. ఇది భారత్ మాత కోసం నిజాయితీగా, అంకితభావంతో పనిచేసే ప్రతి జాతీయవాదికి అవమానకరమంటూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా.. ఆర్‌ఎస్‌ఎస్‌లను “ద్రోహులు” అని పిలవడం సిగ్గుచేటు మాత్రమే కాదని.. ప్రతి జాతీయవాదికి అవమానం అంటూ.. ప్రహ్లాద్ జోషి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందులోని వైరుధ్యం ఆశ్చర్యకరమని అభివర్ణించిన ఆయన.. ఎమర్జెన్సీ విధించి, ప్రజాస్వామ్యాన్ని అణచివేసిన అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు ఇప్పుడు “ప్రజాస్వామ్యాన్ని కాపాడటం” గురించి మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. మీడియాపై సెన్సార్ విధించి, ప్రతిపక్ష నాయకులను జైలులో పెట్టి, రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచిన అదే కాంగ్రెస్ ఇప్పుడు ఇతరులకు ప్రజాస్వామ్య విలువల గురించి ఉపన్యాసాలు ఇస్తోందంటూ మండిపడ్డారు.

చైనా విషయంలో, 1962 యుద్ధంలో విఫలమవడం నుంచి, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత స్థానం వంటి వ్యూహాత్మక అవకాశాలను వదులుకోవడం వరకు, చారిత్రక తప్పిదాల ద్వారా భారతదేశ ప్రపంచ స్థానాన్ని బలహీనపరిచిన అదే కాంగ్రెస్, ఇప్పుడు జాతీయ ప్రయోజనాల సంరక్ష పార్టీగా నటిస్తోందని ప్రహ్లాద్ జోషి విమర్శించారు.. 2008లో చైనా కమ్యూనిస్ట్ పార్టీతో రహస్యంగా అవగాహన ఒప్పందం కుదుర్చుకుని, కచ్చతీవును వదులుకుని, భారత్‌ను బలోపేతం చేయడానికి తమ జీవితాలను అంకితం చేసిన వారిని ‘ద్రోహులు’ అని పిలవడం ద్వారా భారతదేశ వ్యూహాత్మక ప్రయోజనాలను పదేపదే దెబ్బతీసిన పార్టీగా కాంగ్రెస్ నిలుస్తుందన్నారు.

ప్రహ్లాద్ జోషి ట్వీట్..

నిజం ఏమిటంటే, ప్రధాని మోదీజీ నాయకత్వంలో భారతదేశం మునుపెన్నడూ లేనంత బలంగా, సురక్షితంగా, ఆర్థికంగా శక్తివంతంగా, ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడుతున్నందున రాహుల్ గాంధీలో అసంతృప్తి పెరుగుతోందని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.

జాతీయవాద శక్తులను ‘ద్రోహులు’ అని పిలవడం వల్ల, కాంగ్రెస్ పార్టీకి ఉన్న ద్రోహం, కపటత్వం, భారతదేశ ప్రజాస్వామ్యం, భద్రత, జాతీయ గర్వంపై పదేపదే చేసిన దాడుల వారసత్వం చెరిగిపోదు. దేశానికి ఎవరు అండగా నిలిచారో, కేవలం ఒకే కుటుంబానికి ఎవరు మద్దతుగా నిలిచారో ఈ దేశ ప్రజలకు కచ్చితంగా తెలుసు.. అంటూ ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *