తాజావార్తలు

10th Class fake Marks: టెన్త్‌ విద్యార్ధులకు అలర్ట్‌.. వెబ్‌సైట్లలో నకిలీ మార్కుల మెమోలు జారీ! రంగంలోకి విద్యాశాఖ

10th Class fake Marks: టెన్త్‌ విద్యార్ధులకు అలర్ట్‌.. వెబ్‌సైట్లలో నకిలీ మార్కుల మెమోలు జారీ! రంగంలోకి విద్యాశాఖ


అమరావతి, మే 1: పదో తరగతి నకిలీ మార్కుల జాబితాలపై రాష్ట్ర విద్యాశాఖ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఫేక్ వెబ్‌సైట్లు, తప్పుడు మార్కుల జాబితాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ​ఏపీ మార్కుల జాబితాలపై తెలంగాణ ప్రభుత్వ లోగోతో కొందరు దుండగులు గందరగోళం సృష్టించారు. దీంతో రంగంలోకి దిగిన విద్యాశాఖ ​నకిలీ వెబ్‌సైట్లపై కొరడా జులిపించింది. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఇలాంటి నకిలీ వెబ్‌సైట్లను గుర్తించినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు.

​గత ప్రభుత్వ అధికారుల ఫొటోలతో ఉన్న ఫేక్ వెబ్‌సైట్ లింకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రాష్ట్రంలోని పదో తరగతి ​విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తప్పుడు వార్తలను నమ్మవద్దని విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది. ​నకిలీ ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు పోలీసులను కోరారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ గురువారం (ఏప్రిల్ 30) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో మొత్తం 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షలకు పైగా విద్యార్ధులు ఈ పరీక్ష ఫలితాలు చెక్ చేసుకున్నారు. ఇదే అదనుగా కొందరు దుండగులు గందరగోళం సృష్టించడానికి నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి నకిలీ మార్కుల మెమోలను జారీ చేశారు. రంగంలోకి దిగిన విద్యాశాఖ ఈ వెబ్‌సైట్లను గుర్తించి చర్యలు చేపట్టింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *