తాజావార్తలు

అబ్బో.. ఈ అమ్మడు మామూల్ది కాదు..! చేసింది 7 సినిమాలు ఆస్తిమాత్రం రూ. 700కోట్లు..

అబ్బో.. ఈ అమ్మడు మామూల్ది కాదు..! చేసింది 7 సినిమాలు ఆస్తిమాత్రం రూ. 700కోట్లు..


సినిమా ఇండస్ట్రీలో తక్కువ సినిమాలతోనే ఎక్కువ పాపులర్ అయిన బ్యూటీలు చాలా మంది ఉన్నారు. మరికొంతమంది ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్స్ గా మారిన ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. సినిమాలతో కోట్లు కూడబెట్టిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో ఈ అందాల భామ ఒకరు. చేసిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. హీరోయిన్ గా పెద్దగా రాణించలేకపోయింది.. స్పెషల్ సాంగ్స్ తో మాత్రం కుమ్మేస్తుంది. అందంలో తోపు ఈ భామ.. 11 సినిమాల్లో నటించింది 7 సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. కానీ ఈ చిన్నది అందంలోనే.. అంతే కాదు ఆస్తిపాస్తుల్లోనూ ఈ అమ్మడు తోపు.. ఆమె ఆస్తులు ఏకంగా రూ. 700కోట్లు.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

సౌందర్య ఆ స్టార్ హీరోతో సినిమా చేయాల్సింది.. కానీ అతను చెప్పిన ఒకే ఒక్క మాటతో..

బాలీవుడ్ హాట్ బ్యూటీలలో ఒకరైన ఊర్వశి రౌటేలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో మెరుస్తూ యువతలో మంచి క్రేజ్ అందుకుంది. ఉత్తరాఖండ్‌కు చెందిన ఈ నటి 15 సంవత్సరాల వయసులోనే తన మోడలింగ్ వృత్తిని ప్రప్రంభించింది. ఆమె మిస్ టీన్ ఇండియా 2009 టైటిల్‌ను గెలుచుకుంది. చైనాలో జరిగిన మిస్ టూరిజం క్వీన్ ఆఫ్ ది ఇయర్ 2011 టైటిల్ కూడా ఆమె సొంతం చేసుకుంది. ఈ పోటీలను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా ఆమె నిలిచింది. 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె హేట్ స్టోరీ 4, గ్రేట్ గ్రాండ్ మస్తి, సనం రే, పగల్ పంతీ వంటి చిత్రాలలో నటించింది. కానీ ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు దక్కలేదు. దీంతో చేతిలో అంతగా డబ్బు లేని పరిస్థితి ఏర్పడింది. సినిమా అవకాశాలు ఇస్తామని మోసం చేసిన వారే ఎక్కువ కావడంతో ఆమె సినీ కెరీర్ ముగిసిపోయిందని భావించారు. సరిగ్గా అదే సమయంలో ఊర్వశికి భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో పరిచయం ఏర్పడి, ఆయనతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

తల్లి దండ్రులకు కర్మకాండలు చేయలేకపోయా..! బంధువులందరూ తిట్టారు.. ఎమోష్నల్ అయిన హీరో

అదే సమయంలో సినిమా అవకాశాల కోసం బాలీవుడ్ నిర్మాత సమీర్ నాయర్‌తో కూడా ఆమె డేటింగ్ చేసినట్లు ప్రచారం జరిగింది. సమీర్ ఆమె కంటే వయసులో చాలా పెద్దవాడు అయినప్పటికీ, సినిమా అవకాశాల కోసం ఆమె ఆయనతో టచ్‌లో ఉండేదని టాక్ వచ్చింది. అయితే అతను ఛాన్సులు ఇస్తానని కాలయాపన చేస్తున్నట్లు గ్రహించిన ఊర్వశి అతనికి గుడ్‌బై చెప్పినట్లు వార్తలు వచ్చాయి. బాలీవుడ్‌లో ఒక్క అవకాశం లభిస్తే తన టాలెంట్‌తో జీవితంలో స్థిరపడాలని ఆమె కలలు కనేది. అలా టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆయన ఊర్వశికి పగల్ పంతీ సినిమాలో ఒక హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. ఆ సినిమా ఫ్లాప్ అయినా, వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని, ఆయనతో కూడా ఊర్వశి డేటింగ్ చేసినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. సినిమా గ్లామర్ ఫీల్డ్‌లో కొనసాగుతున్న సమయంలో రిషబ్ పంత్ ఒక ఫంక్షన్‌లో ఆమెకు పరిచయం అయ్యారు. ఆపై కొంతకాలం డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చినా రిషబ్ వాటిని తిప్పికొట్టారు. రిషబ్ తన సోషల్ మీడియాలో ఊర్వశిని బ్లాక్ చేయడంతో వీరిద్దరూ మీడియాలో ప్రధాన వార్తలుగా నిలిచారు. తర్వాత కొంతకాలం పాటు ఇద్దరూ పరోక్షంగా ఒకరిపైన ఒకరు సోషల్ మీడియాలో కామెంట్లు, సెటైర్లు పెట్టుకోవడంతో వారిద్దరి మధ్య ఎఫైర్ నిజమేనని ప్రచారం జరిగింది.

50 దేశాల్లో విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమా.. తొలి తెలుగు పాన్ వరల్డ్ మూవీ.. ఇప్పటికీ ఆ రికార్డ్ అలానే

సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఊర్వశి రౌటేలా ఇప్పటివరకు ప్రధాన హీరోయిన్‌గా కేవలం 7 సినిమాలు మాత్రమే చేసింది. అవి కూడా అంతగా చెప్పుకోదగినవి కావు. అడపా దడపా ఐటమ్ సాంగ్స్‌లో కనిపించేది. కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 13. ఏళ్ల లోపులోనే ఆమె రూ.150 కోట్లు పెట్టి ముంబైలో ఒక పెద్ద బంగ్లాను కొనుగోలు చేశారు. ఈ డబ్బంతా దుబాయ్, యూకే, కెనడా వంటి దేశాల్లో ఈ బ్యూటీ తన గ్లామర్‌తో సంపాదించిందని ప్రచారంలో ఉంది. ఇలా ఊర్వశి కేవలం 13 ఏళ్ల సినిమా కెరీర్‌లో సంపాదించలేనిది కేవలం రెండు సంవత్సరాలలోనే సుమారు రూ.300 కోట్లు వెనకేసినట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆస్తిపాస్తులు రూ. 700కోట్లు అని అంచనా వేస్తున్నారు. అంతే కాదు స్పెషల్ సాంగ్స్ కు నిమిషానికి రూ. కోటి రూపాయిలు తీసుకుంటుందని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన అందంతో మతిపోగొడుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *