అమరావతి, ఏప్రిల్ 15: రాష్ట్ర విద్యార్ధులు ఎప్పుడెప్పుడాని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు 2026 ఈ రోజు (ఏప్రిల్ 15) విడుదలయ్యాయి. బుధవారం (ఏప్రిల్ 15) ఉదయం 10.31 గంటలకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫలితాలను టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌తోపాటు ఏపీ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లోనూ చెక్ చేసుకోవచ్చు. అలాగే మన మిత్ర వాట్సప్ నంబరు 9552300009 ద్వారా కూడా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ నంబరుకు Hi అని మెసేజ్ పంపించి, ఫలితాలు చిటికెలో పొందొచ్చు. విద్యార్ధులు తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సబ్‌మిట్ చేస్తే.. వెంటనే స్ర్కీన్‌పై మార్కులు ప్రత్యక్షమవుతాయి. అయితే ఈ ఏడది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో తీసుకొచ్చిన మార్పుల కారణంగా అదనంగా ఎంపిక చేసుకున్న ఆరో సబ్జెక్టు మార్కులను మార్కుల జాబితాలో విడిగా ఇస్తారని ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో ఎప్పటి మాదిరిగానే అమ్మాయిలు సత్తా చాటారు. దాదాపు అన్ని జిల్లాల్లో అమ్మాయిలే ప్రథమ ర్యాంకులు సాధించారు.
ఏపీ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్‌లకు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,57,312 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. సమాధాన పత్రాల మూల్యాంకనం మార్చి 21 నుంచి మొదలవగా ఏప్రిల్ 14తో పూర్తయ్యింది. అనంతరం మార్కుల ప్రాసెస్‌ను కూడ త్వరిత గతిన పూర్తి చేసిన బోర్డు అనుకున్న సమయంకంటే కాస్త ముందుగానే ఫలితాలను వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
లేదా
లేదా
ఏపీ ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరోవైపు జూన్ 1 నుంచి 2026-27 విద్యా సంవత్సరానికి జూనియర్ కాలేజీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మే 31 నాటికే సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను కూడా విడుదల చేయాలని ఇంటర్ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
