అమరావతి, ఏప్రిల్ 15: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు 2026 బుధవారం (ఏప్రిల్ 15) ఉదయం 10.31 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. తాజా ఫలితాల్లో ఇంటర్ విద్యార్ధులు గరిష్ఠ స్థాయిలో ఉత్తీర్ణత సాధించడం విశేషం. గత 12 ఏళ్ల చరిత్రలో కనీవినని రీతిలో ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 4,71,864 మంది పరీక్షలు రాయగా.. అందులో 3,61,526 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే 77 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక సెకండ్ ఇయర్‌లో 4,46,537 మంది పరీక్షలు రాయగా.. అందులో 3,59,816 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే ఏకంగా 81 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషన్‌లో ఫస్ట్ ఇయర్‌లో 61 శాతం, సెకండ్ ఇయర్‌లో 74 శాతం నమోదైంది.
ఏపీ ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, మోడల్, సోషల్ వెల్పేర్ కాలేజీలు కూడా ఫలితాల్లో సత్తా చాటాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కు ప్రభుత్వ కాలేజీల్లో 54 శాతం, మోడల్ స్కూళ్లలో 75 శాతం, సోషల్ వెల్పేర్ హాస్టల్లలో గరిష్ఠంగా 87 శాతం, కేజీబీవీల్లో 84 శాతం, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లలో90 శాతం, బీసీ వెల్ఫేర్‌లో 97 శాతం, ఏపీఆర్జేసీ కాలేజీల్లో 92 శాతం చొప్పున ఉత్తీర్ణత నమోదైంది.
ఇవి కూడా చదవండి
ఇక ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో 46 శాతం, ప్రైవెట్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో 80 శాతం చొప్పున ఉత్తీర్ణత పొందారు. మొత్తంగా 77 శాతం ఉత్తీర్ణత వచ్చింది. ఇక సెకండ్ ఇయర్‌లో అన్ని కాలేజీల్లో కలిపి 81 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా ఈ ఏడాది ఫస్ట్, సెకండ్ ఇయర్‌కు కలిపి 10.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
