తాజావార్తలు

Hyderabad: హైదరాబాద్ వాసులకు మరో గుడ్ న్యూస్.. టీజీఎస్‌ఆర్టీసీ నుంచి ఎగిరి గంతేసే వార్త..

Hyderabad: హైదరాబాద్ వాసులకు మరో గుడ్ న్యూస్.. టీజీఎస్‌ఆర్టీసీ నుంచి ఎగిరి గంతేసే వార్త..


Hyderabad: హైదరాబాద్ వాసులకు మరో గుడ్ న్యూస్.. టీజీఎస్‌ఆర్టీసీ నుంచి ఎగిరి గంతేసే వార్త..

హైదరాబాద్ ప్రజలకు టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త తెలిపింది. నగరంలో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్ వెలుపల కేవలం ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే తిప్పనుంది. పర్యావరణరహిత రవాణా దిశగా టీజీఎస్‌ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. కాలం చెల్లిన డీజిల్ బస్సులను దశలవారీగా తొలగించి ఎలక్ట్రిక్ బుస్సులను నగరంలో నడపనుంది. నగరంలో జనాభా ఎక్కువమంది ఉండటం, వాహనాలు ఎక్కువగా ఉండటంతో కాలుష్య పెరుగుతోంది. దీనిని నివారించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీజిల్ బస్సుల స్థానంలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. అంతేకాకుండా వీటి కోసం ప్రధాన డిపోల్లో ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్లు

ఇప్పటికే మియాపూర్, హయత్ నగర్, రాణిగంజ్, కంటోన్మెంట్, హెచ్‌సీయూ వంటి డిపోలలో చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. వచ్చే నెలలో కూకట్ పల్లి డిపోలో కూడా ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టీజీఎస్‌ఆర్టీసీ సిద్దమవుతోంది. ఇక ఎలక్ట్రిక్ బస్సుల కోసం కావాల్సిన మౌలిక సదుపాయాలపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. సౌకర్యాలను మరింత విస్తరించేందుకు సిద్దమయ్యారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో మనిన్ని డిపోలలో ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పనున్నారు. బండ్లగూడ, ఇబ్రహీంపట్నం, మెహిదీపట్నం, బర్కత్ పుర, ఫరూక్ నగర్, చెంగిచెర్ల, జీడిమెట్ల, కాచిగూడ, మిధాని, ఉప్పల్, మేడ్చల్, జవహర్ నగర్, ముషీరాబాద్ డిపోలలో త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎక్కడికక్కడ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వస్తే ఎలక్ట్రిక్ బస్సులను నడపడం మరింత సులభతరం అవుతుంది.

పెరిగిన ఎలక్ట్రిక్ బస్సులు

ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్‌ జోన్లో ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్నాయి. దాదాపు 490 ఎలక్ట్రిక్ బస్సులు సర్వీసులు అందిస్తున్నాయి. ఇప్పటికే 2 వేల ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసేందుకు టీజీఎస్‌ఆర్టీసీ ఆర్డర్ ఇచ్చింది. ప్రైవేట్ సంస్థకు ఈ బాధ్యతలను అప్పగించింది. ప్రైవేట్ సంస్థ ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి టీజీఎస్‌ఆర్టీసీ అప్పగించనుంది. దశలవారీగా వీటిని అందించనుంది. కేంద్ర ప్రభుత్వం ఈ-బస్ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోళ్లపై సబ్సిడీ అందిస్తోంది. ఈ పథకంగా టీజీఎస్‌ఆర్టీసీకి 2800 బస్సులను కేటాయించింది. దీంతో ఈ బస్సులన్నింటినీ హైదరాబాద్ పరిధిలోనే తిప్పనుంది. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌లో కేవలం ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే తిరుగుతాయి. డీజిల్ బస్సుల ఇక కనిపించవు. హైదరాబాద్ బయట మాత్రమే డీజిల్ బస్సులు తిరుగుతాయి. దీని వల్ల నగరంలో కాలుష్యం భారీగా తగ్గనుంది. కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *