తాజావార్తలు

Dinner Time: రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేస్తే.. మీ ఒంట్లోకి షుగర్‌, బీపీ ఈ జన్మలో చేరవు!

Dinner Time: రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేస్తే.. మీ ఒంట్లోకి షుగర్‌, బీపీ ఈ జన్మలో చేరవు!


Dinner Time: రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేస్తే.. మీ ఒంట్లోకి షుగర్‌, బీపీ ఈ జన్మలో చేరవు!

ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు మీరు తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారాన్ని పడుకోవడానికి 3 గంటల ముందు తినాలి. ఈ ఒక్క అలవాటు అనేక రకాల వ్యాధులను నియంత్రించడంలో సహాయపడుతుందని అంటున్నారు. అంతేకాకుండా నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో పడుకోవడానికి 3 గంటల ముందు ఆహారం తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు నుంచి గుండె జబ్బుల వరకు అన్నింటి ప్రమాదాన్ని తగ్గించవచ్చని తెలిపారు. పరిశోధనల ప్రకారం, రాత్రి పడుకోవడానికి కొన్ని గంటల ముందు ఆహారం తీసుకోవడం జీవక్రియను మెరుగుపరుస్తుంది. సరైన నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. శరీరం సర్కాడియన్ రిథమ్ ప్రకారం పనిచేస్తుందని పరిశోధనలో తేలింది. అదే మీరు ఆలస్యంగా తింటే, శరీరం సర్కాడియన్ రిథమ్ సరిగ్గా పనిచేయదు. అంతేకాకుండా తప్పుడు సమయంలో తినడం వల్ల జీర్ణవ్యవస్థ రాత్రంతా చురుకుగా పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు జీవక్రియకు ఆటంకం కలుగుతుంది. ఫలితంగా అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది.

నార్త్‌వెస్టర్న్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు మధుమేహం, గుండె జబ్బులు ఉన్న 36 నుంచి 75 సంవత్సరాల వయస్సు గల 139 మంది అధిక బరువు గల వ్యక్తులను ఈ అధ్యయనంలో చేర్చుకుని, వారిని రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపు 16 గంటలు, మరొక గ్రూపు 13 గంటలు ఉపవాసం ఉన్నారు. రెండు గ్రూపుల వారికి నిద్రకు 3 గంటల ముందు తినమని, చీకటి ప్రదేశంలో ఉండమని చెప్పారు. ఎక్కువసేపు ఉపవాసం ఉన్న గ్రూపులో రక్తపోటు తక్కువగా ఉండటం, రక్తంలో చక్కెర నియంత్రణ మెరుగ్గా ఉండటం, ఇన్సులిన్ సున్నితత్వం, గ్లూకోజ్ స్థాయిలు మెరుగుపడటం వంటివి గమనించారు.

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రాత్రిళ్లు ఏ సమయంలో తినాలి?

రాత్రి 8 గంటలలోపు భోజనం ముగించాలి. రాత్రి 11 గంటలలోపు నిద్రపోవడానికి ప్రయత్నించాలి. ఈ నియమాన్ని పాటించే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. ఈ సాధారణ అలవాటు మీరు బాగా నిద్రపోవడానికి, అధిక రక్తపోటును నియంత్రించడానికి, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *