తాజావార్తలు

SRH vs LSG: లక్నోతో పోరుకు సిద్ధమైన హైదరాబాద్.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే..?

SRH vs LSG: లక్నోతో పోరుకు సిద్ధమైన హైదరాబాద్.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే..?


SRH vs LSG: లక్నోతో పోరుకు సిద్ధమైన హైదరాబాద్.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే..?

IPL 2026 LSG vs SRH Match 10: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికీ, కోల్‌కతాతో జరిగిన రెండో మ్యాచ్‌లో అద్భుతమైన పునరాగమనం చేసి విజయాన్ని అందుకుంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తమ మొదటి మ్యాచ్‌లోనే పరాజయం పాలైన లక్నో, ఈ మ్యాచ్‌తో విజయాల ఖాతా తెరవాలని చూస్తోంది. హైదరాబాద్ జట్టుకు ఇది మూడో మ్యాచ్ కాగా, లక్నోకు ఇది రెండో పోరు.

ముఖాముఖి రికార్డులలో లక్నోదే పైచేయి..

ఐపీఎల్ చరిత్రలో లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటివరకు 6 సార్లు తలపడ్డాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే లక్నో జట్టుదే పైచేయిగా కనిపిస్తోంది. లక్నో 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, హైదరాబాద్ కేవలం 2 మ్యాచ్‌ల్లోనే గెలిచింది.

అత్యధిక పరుగులు: హైదరాబాద్‌పై లక్నో చేసిన అత్యధిక స్కోరు 205 పరుగులు కాగా, లక్నోపై హైదరాబాద్ చేసిన అత్యధిక స్కోరు 206 పరుగులు.

ఇది కూడా చదవండి: కాటేరమ్మ కొడుకు పొగరు ఠక్కున దించేశారుగా.. ఇదే రిపీటైతే బ్యాన్.!

అత్యల్ప పరుగులు: లక్నో 127 పరుగులకు పరిమితం కాగా, హైదరాబాద్ 121 పరుగులకు ఆలౌట్ అయింది.

గత సీజన్‌లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి సమవుజ్జీలుగా నిలిచాయి. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు బౌలింగ్ విభాగం బలంగా ఉంటుందో వారికే విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

టాస్ ఎవరికి కలిసొస్తుంది?

టాస్ విషయానికి వస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ లక్కీ టీంగా కనిపిస్తోంది. గత ఆరు సందర్భాలలో 4 సార్లు హైదరాబాద్ టాస్ గెలిచింది. లక్నో కేవలం 2 సార్లు మాత్రమే టాస్ గెలిచింది. అయితే టాస్ గెలిచినంత మాత్రాన విజయం దక్కుతుందని చెప్పలేం. ఎందుకంటే టాస్ గెలిచిన తర్వాత హైదరాబాద్ ఒకసారి బ్యాటింగ్, మరోసారి బౌలింగ్ ఎంచుకొని కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. లక్నో కూడా టాస్ గెలిచిన సందర్భాల్లో ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. అంటే టాస్ కంటే కూడా మైదానంలో చూపే అత్యుత్తమ ప్రదర్శనే గెలుపును నిర్ణయించనుంది. కాగా, ఈ మ్యాచ్ హైదరాబాద్ టీం సొంత గ్రౌండ్‌లో జరగనుండడం ఇషాన్ సేనకు కాస్త అనుకూలంగా మారొచ్చు.

ఇది కూడా చదవండి: ఎవడ్రా సామీ నువ్వు.. ఒకే ఇన్నింగ్స్ లో 18 సిక్సర్లా.. టీ20 క్రికెట్ లోనే డేంజరస్ ఇన్నింగ్స్..

బ్యాటింగ్ వర్సెస్ బౌలింగ్..

హైదరాబాద్ జట్టులో అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉండటం ఆ జట్టుకు బలం. లక్నో జట్టు కేఎల్ రాహుల్ నాయకత్వంలో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌ను కలిగి ఉన్నప్పటికీ, బౌలింగ్ విభాగంలో నిలకడ లేమి కనిపిస్తోంది. ఈ ఉత్కంఠభరిత పోరులో ఎవరు బాజీ మారుస్తారో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *