
కొన్ని సినిమాలు కేవలం వినోదం మాత్రమే కాదు, అవి ఒక భావోద్వేగం. వీక్షకులకే కాదు, వాటిని తెరకెక్కించిన వారికి కూడా ఈ భావోద్వేగం ఉంటుంది. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన అదుర్స్ చిత్రం కూడా అలాంటి ఒక భావోద్వేగపూరిత సినిమానే. ఈ చిత్రానికి ఒక ప్రత్యేకమైన అభిమానగణం ఉంది. తారక్ ఒకవైపు ఆధునిక శైలిలో కనిపించినా, నుదుట నామాలతో సాంప్రదాయకంగా కూడా ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ తల్లికి ఆయన నటించిన చిత్రాలలో అదుర్స్ అత్యంత ఇష్టమైన సినిమా అని, ఈ విషయాన్ని ఆమె దర్శకుడు వీవీ వినాయక్‌తో చెప్పి ముచ్చట పడ్డారని తెలిసింది. బ్రహ్మానందం, నయనతారతో పాటు ఈ సినిమాలో నటించిన చారి వంటి ప్రతి ఒక్కరూ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు.అయితే, ఇంతటి ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా అనే ప్రశ్నపై దర్శకుడు వీవీ వినాయక్ స్పష్టత ఇచ్చారు. అదుర్స్ కథ అక్కడితో ముగిసిపోయిందని, ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్!
కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్!
ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ
నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు
