తాజావార్తలు

Career Growth Tips: జీవితంలో సక్సెస్ కావాలా? అయితే ఈ టిప్స్ మిస్ అవొద్దు..!

Career Growth Tips: జీవితంలో సక్సెస్ కావాలా? అయితే ఈ టిప్స్ మిస్ అవొద్దు..!


Career Growth Tips: జీవితంలో సక్సెస్ కావాలా? అయితే ఈ టిప్స్ మిస్ అవొద్దు..!

తమ ఉద్యోగ జీవితంలో ఉన్నత స్థానాలకు చేరాలనుకుంటే కొన్ని విషయాలను తప్పక నేర్చుకోవాలి. కార్పొరేట్ సంస్థల్లో కొత్తగా చేరిన ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి తరచూ ఫీడ్‌బ్యాక్ తీసుకోవడాన్ని అలవాటుగా చేసుకోవాలి. తమ ఆలోచనలు, పనికి సంబంధించిన విషయాలు, భవిష్యత్తు లక్ష్యాలను టీమ్ లీడర్‌తో తరచూ చర్చించడం అవసరం. మనలో ఉన్న లోపాలను గుర్తించి, వాటిని సరిచేసుకోవడానికి ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి. కమ్యూనికేషన్ అనేది కెరీర్ గ్రోత్‌కు చాలా అవసరం. ఉన్నతాధికారులతో తరచూ చర్చలు జరపడం ద్వారా ఇద్దరికి తమ పట్ల సానుకూల అభిప్రాయాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. దీంతో పనితోపాటు ఎదుగుదల కూడా అంత కష్టంగా మారదు. సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఉద్యోగ జీవితంలో ఎదుగుదల అనేది ఉండకపోవచ్చు. మంచి కమ్యూనికేషన్ ద్వారా పదోన్నతులు కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంది. అందుకే ఉన్నతాధికారులతో పని గురించి తరచూ చర్చలు జరుపుతుండాలి.

ఎందుకు ఫీడ్‌బ్యాక్ అవసరం?

కెరీర్‌లో ఎదగడానికి, మంచి ఉద్యోగిగా గుర్తింపు పొందడానికి, తప్పులను సరిదిద్దుకోవడానికి ఇతరుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం ఎంతో కీలకం. కార్పొరేట్ సంస్థల్లో అవకాశాలు ఎవరి కోసం ఆగవు. ఇతరులు వచ్చి మీ పనితీరుపై చెప్పాలని ఎదురు చూస్తే, మీ అభివృద్ధికి మీరు మీరే అడ్డంకి అయినట్టే. కాబట్టి తరచూ పనితీరుపై చర్చించడం ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎలా మెరుగుపరుచుకోవాలి అనే విషయాలను తెలుసుకోవచ్చు. మౌనంగా పని చేస్తూ ఉంటే గుర్తింపు వస్తుందని అనుకోవడం సరైనది కాదు.

మానవ సంబంధాలు

అంతేగాక, సహోద్యోగులతో కూడా మంచి సంబంధాలను కలిగి ఉండాలి. వారితో స్నేహపూర్వకంగా ఉండాలి. కఠినంగా వ్యవహరిస్తే పని వాతావరణం దెబ్బతింటుంది. దీంతో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి చేయాల్సిన పనిలోని నాణ్యత కూడా దెబ్బతింటుంది. ఉన్నత స్థాయి ఎదగాలంటే సంస్థలోని ప్రతి ఒక్కరితో మంచి మానవ సంబంధాలను కలిగి ఉండటం చాలా ముఖ్యం.

ఫీడ్‌బ్యాక్‌తో మార్పు

సమర్థవంతంగా పనిచేసినా ప్రమోషన్ రావడం లేదంటే.. దానిపై మనం పునరాలోచించుకోవాలి. అంతేగాక, ఉన్నతాధికారులతో దీని గురించి చర్చించాలి. లేదంటే వారు కూడా పట్టించుకోరు. అర్హత ఉన్నప్పటికీ ఎందుకు ప్రమోషన్ రాలేదో ఉన్నతాధికారుల నుంచి అడిగి తెలుసుకోవాలి. దీంతో వారు కూడా ఈ విషయం గురించి ఆలోచించి మీ పని పట్ల సంతృప్తిగా ఉంటే మీకు తప్పక పదోన్నతి లభించే అవకాశాలుంటాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటే ఎక్కడ పనిచేసినా ఉన్నత స్థానాలకు చేరుకోవడం అంత కష్టం కాకపోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *