తాజావార్తలు

Telangana: మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఉచితంగా..

Telangana: మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఉచితంగా..


Telangana: మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఉచితంగా..

స్వాభిమానం.. సాధికారిత.. అదే బాటలో ఇప్పుడు ఆరోగ్య భద్రత.. మహిళ ఆరోగ్యం కోసం  తెలంగాణ ప్రభుత్వం  డిజిటిల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌,  హెల్త్‌  స్ర్కీనింగ్‌కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే  తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ   క్యాన్సర్‌పై  విస్తృతంగా  అవగాహన కల్పిస్తోంది.  రాష్ట్ర వ్యాప్తంగా  HPV వ్యాక్సినేషన్‌  కొనసాగుతోంది.  ఇప్పుడు  హెల్త్‌ ప్రొఫైల్‌ స్ర్కీనింగ్‌ తో మహిళా ఆరోగ్యానికి మరింత భద్రతనిస్తోంది ప్రభుత్వం. మహిళల్లో  రక్తహీనత , మధుమేహం ,బీపీ  వంటి సాధారణ ఆరోగ్య సమస్యలు మొదలు  క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల వరకు స్ర్కీనింగ్‌ ద్వారా ముందే  గుర్తించవచ్చు.  18 ఏళ్లు నిండిన ప్రతి యువతికి  ప్రభుత్వం ఉచితంగా ఈ పరీక్షలు చేస్తోంది. హిమోగ్లోబిన్ శాతం, షుగర్ స్థాయితో గుర్తిస్తారు,అలాగే  స్క్రీనింగ్  ద్వారా బ్రెస్ట్‌, సర్వైకల్‌ క్యాన్సర్ లాంటి 30 రకాల టెస్ట్లులు నిర్వహిస్తారు.

ఇది చదవండి: ప్రతీ ఇంట్లో కరెంట్ బిల్లు రూ. 100 కూడా రాదు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు

ప్రతీ మహిళ ఆరోగ్య వివరాలను డిజిటిల్‌గా రికార్డు చేస్తారు.  ప్రత్యేక ID తో హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయబడుతుంది. డిజిటల్‌ హెల్త్‌ కార్డ్‌ను అందిస్తారు. వీటి ద్వారా వివిధ రకాలు వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా  వెంటనే   టెస్ట్ రిపోర్టులను తెలుసుకోవచ్చు. అంతేకాదు  సంబంధింత మెడికల్‌ టీమ్స్‌  రెగ్యులర్‌గా ఫాలో అప్‌ చేస్తూ సలహాలు, సూచనలు ఇస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  ఈ నెల 8 నుంచి స్ర్కీనింగ్‌ టెస్ట్‌లు ప్రారంభమయ్యాయి.  మూడు దశల్లో సుమారు 46 లక్షల మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. తొలి దశలో ప్రతి జిల్లా నుంచి 5 మండలాల్లో , రెండో దశలో మరో 10 మండలాల్లో, చివరి దశలో మిగిలిన అన్ని మండలాల్లో స్క్రీనింగ్ చేపట్టనున్నారు. మొత్తం స్క్రీనింగ్‌ను 6 నెలల్లో పూర్తి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ టార్గెట్ పెట్టుకుంది.

ఇది చదవండి: పోలీసులు థర్డ్ డిగ్రీ ఎప్పుడు ఉపయోగిస్తారంటే.? ఎవ్వరికీ తెలియని నిజం..

మహిళల హెల్త్ ప్రొఫైలింగ్ అనేది ఒక విప్లవాత్మక అడుగు. వ్యాధి సోకిన తర్వాత చికిత్స కంటే.. వ్యాధి రాకుండా నివారించడమే మేలు. ఆ దిశగా  డిజిటిల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌  మహిళలకు ఎంతో  ఉపయోగకరంగా వుంటుంది. గ్రామాల్లో ఆశా కార్యకర్తల నుంచి నగరాల్లోని బస్తీ దవాఖానాల వరకు ఈ స్క్రీనింగ్ కార్యక్రమం కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది మహిళలకు బీపీ, షుగర్‌, థైరాయిడ్‌ వంటి సమస్యలు వుంటున్నాయి.కానీ వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల  సమస్య వున్నట్టు వాళ్లకు తెలియడంలేదు. ఇకపై అలా జరగదు. ప్రభుత్వం చేపడుతున్న స్ర్కీనింగ్‌ టెస్ట్‌ ల వల్ల  మహిళల ఆరోగ్య సమస్యలను గుర్తించడంతో పాటు సత్వర వైద్యసాయం అందనుంది.

ఇది చదవండి: మీరు దరిద్రంలో ఉన్నారా..? అయితే మీ చెప్పులను అక్కడ వదిలిస్తే డబ్బే డబ్బు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *