హైదరాబాద్, మార్చి 4: రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు గురువారం (మార్చి 5) విడుదల కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఈ సారి మూడు రకాలుగా పదో తరగతి హాల్‌టికెట్లు విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తుంది. విద్యార్ధులు ఈ మూడింటిలో ఏ విధంగానైనా తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా సెకండరీ బోర్డు వెబ్సైట్లో హాల్ టికెట్లను విడుదల చేస్తారు. అనంతరం విద్యార్ధుల తల్లిదండ్రుల వాట్సాప్ నెంబర్‌కు సైతం పదో తరగతి హాల్ టికెట్లను పంపిస్తారు. మరోవైపు ప్రింటెడ్ హాల్‌టికెట్లను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లకు చేరవేస్తారు. ఈ విధంగా విద్యార్ధులు హాల్‌టికెట్లను మూడు రకాలుగా పొందొచ్చన్నమాట. కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ఫీజు బకాయిలు పేరిట విద్యార్దులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నట్లు బోర్డుకు యేటా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ పదో తరగతి హాల్ టికెట్లు 2026 డౌన్లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లేదంటే వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కుదరని పక్షంలో పాఠశాల ప్రిన్సిపల్‌ను సంప్రదించి వారి నుంచి నేరుగా పొందవచ్చు. విద్యార్థులు ఏ హాల్‌టికెట్‌తో పరీక్ష కేంద్రాలకు వచ్చినా పరీక్షలకు అనుమతిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,28,248 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
ఇవి కూడా చదవండి
మరోవైపు ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో ఇప్పటికే పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఆ రాష్ట్రంలో ఈ పరీక్షలు మార్చి 16 నుంచి మొదలవనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 16 నుంచే పరీక్షలు మొదలవనున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.
