తాజావార్తలు

Mumbai Airport: ఇండిగో- ఎయిరిండియా విమానాలు ఢీ.. తప్పిన పెను ప్రమాదం

Mumbai Airport: ఇండిగో- ఎయిరిండియా విమానాలు ఢీ.. తప్పిన పెను ప్రమాదం


Mumbai Airport: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో- ఎయిర్ ఇండియా విమానాల రెక్కలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ల్యాండింగ్ సమయంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుండి ముంబైకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం రెక్కలు ముంబై నుండి కోయంబత్తూర్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం రెక్కలను ఢీకొన్నాయి. సంఘటన జరిగిన సమయంలో రెండు విమానాలలో ప్రయాణికులు ఉన్నారు. దీని కారణంగా పెద్ద ప్రమాదం తప్పింది. DGCA ఈ విషయంపై దర్యాప్తు చేసి రెండు విమానయాన సంస్థలను నివేదిక సమర్పించమని కోరింది.

రెండు రెక్కలు స్వల్పంగా ఢీకొనడంతో విమానాల్లో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రయాణికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇండిగో స్పందన

ముంబై విమానాశ్రయంలో జరిగిన సంఘటన గురించి ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పందించింది. ఫిబ్రవరి 3, 2026న హైదరాబాద్ నుండి ముంబైకి వెళ్లే తమ విమానం 6E791.. ల్యాండింగ్ తర్వాత టాక్సీలో వెళుతుండగా రెక్క చివర మరొక విమానయాన సంస్థ విమానాన్ని ఢీకొట్టిందని, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపింది. సంఘటన జరిగిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపింది. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోంది. తమ ప్రయాణికులు, సిబ్బంది, విమానాల భద్రత తమ ప్రధాన ప్రాధాన్యత అని తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *