తాజావార్తలు

Short Circuit: బూడిదైన ఆశలు… చిద్రమైన సొంతింటి కల.. డబ్బులన్ని అగ్నిపాలు..!

Short Circuit: బూడిదైన ఆశలు… చిద్రమైన సొంతింటి కల.. డబ్బులన్ని అగ్నిపాలు..!


Short Circuit: కష్టపడి కూడ బెట్టుకున్న సొమ్ము, ఆశలతో అప్పు తెచ్చి దాచుకున్న డబ్బు కళ్ల ముందే బూడిదైతే.. ఆ గుండె పడే వేదన వర్ణనాతీతం! సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకున్న ఒక నిరుపేద కుటుంబంపై దాడి చేసి అగ్ని ప్రమాదంతో ఆ కల చిద్రమైంది. ఈ హృదయ విదారక ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మర్యాలకు చెందిన సోంగి స్వామి, వెంకటమ్మ దంపతుల కుటుంబం ఎన్నో ఏళ్లుగా ఒక పూరి గుడిసెలో నివసిస్తూ వస్తోంది. ఎప్పటికైనా తల దాచుకోవడానికి ఒక పక్కా ఇల్లు కట్టుకోవాలనేది వారి చిరకాల వాంఛ. ఆ కలను సాకారం చేసుకునేందుకు
కష్టపడి కొంత సొమ్మును పోగేసుకున్నారు. బంధువులు, ఇతరుల వద్ద అప్పు చేసి మరీ రూ. 2,50,000 నగదును సమకూర్చుకున్నారు. ఆ డబ్బును కొత్త ఇల్లు కట్టుకోవడం కోసం అత్యంత భద్రంగా ఇంట్లోనే దాచుకున్నారు.

షాక్ సర్క్యూట్ రూపంలో అగ్నిప్రమాదం..

రాత్రి వేళ అందరూ ఇళ్లలో ఉన్న సమయంలో ఒక్కసారిగా షాక్ సర్క్యూట్ రూపంలో మంటలు చెలరేగాయి. పూరి ఇల్లు కావడంతో క్షణాల వ్యవధిలో మంటలు నలుమూలలా వ్యాపించాయి. ప్రాణ భయంతో కుటుంబ సభ్యులు పరుగులు తీస్తూ కేకలు వేస్తూ బయటపడ్డారు. గ్రామస్తులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు యత్నించినప్పటికీ, మంటల ఉధృతి తగ్గలేదు. దీంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేసే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఇవి కూడా చదవండి



బూడిదైన ఆశలు..

ఇంట్లోని నిత్యావసర వస్తువులు, ఫర్నిచర్ పూర్తిగా కాలిపోవడంతో పాటు.. కొత్త ఇంటి కోసం ఎంతో కష్టపడి తెచ్చి దాచుకున్న రూ. 2.50 లక్షల నగదు పూర్తిగా బూడిదైపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం, తెచ్చిన అప్పులకు వడ్డీ ఎలా కట్టాలో తెలియక ఆ కుటుంబం రోడ్డున పడింది. చిరకాల వాంఛ సొంతింటిని కట్టుకోవాలని అప్పు తీసుకొచ్చామని, అగ్ని దేవుడు మా సర్వస్వాన్ని బూడిద చేశాడనీ బాధితుడు స్వామి వాపోతున్నాడు. తెచ్చిన అప్పు ఎలా తీర్చాలి? మా బతుకు నాశనమైంది” అంటూ బాధితుడు స్వామి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. బాధిత కుటుంబం విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తోంది. అన్ని కోల్పోయి నిరాశ్రయులైన ఈ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఆర్థిక సహాయం అందించి పునరావాసం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *