తాజావార్తలు

బరువుతగ్గాలంటే ఏం చేయాలి? సులభమైన మరియు ప్రభావవంతమైన చిట్కాలు.

బరువు పెరగడం ఎంత తేలికో, తగ్గడం అంత కష్టం. జిహ్వ చాపల్యాన్ని అణుచుకోలేం!

“బరువు తగ్గాలంటే?

O My God

ముందుగా

బరువు వల్ల

బరువు వల్ల…సక్రమమైన జీవనశైలిని అనుసరించలేం! ఫలితంగా శరీరం బరువు అదుపు తప్పుతుంది.

అయితే ఇలా పెరిగిన శరీర బరువును ఆయుర్వేద వైద్య చికిత్సలతో, ఆయుర్వేదం సూచించే నియమాలతో తగ్గించుకోవచ్చు.

సాధారణంగా బరువు పెరగడం ప్రపంచ దేశాలన్నిటిలో కనిపిస్తున్న అత్యంత సాధారణమైన ఆరోగ్య సమస్య. మహర్షి చరకుడు రాసిన చరకసంహితంలో ఈ సమస్యకు మేదోరోగం అనే పేరు ఉంది.

తొడలు, ఉదరం ఇంకా ఛాతీ మొదలైన శరీర ప్రదేశాల్లో అడిపోజ్ కణజాల పరిమాణం పెరిగి, తద్వారా ఆరోగ్యం మీద దుష్ప్రభావం పడడమే ఊబకాయం అని ఆయుర్వేదం ఊబకాయాన్ని విశ్లేషించింది.

ఇందుకు కారణాలు… ప్రధానంగా అస్తవ్యస్థ ఆహారపుటలవాట్లు, జీవనశైలి, అలవాట్లే కారణం.

శరీరంలోకి వెళ్లే క్యాలరీలకు తగ్గట్టు శరీరం క్యాలరీలను ఖర్చు చేయకపోవడం మూలంగా అదనంగా మిగిలిపోయిన క్యాలరీలు శరీరంలో కొవ్వు రూపంలో పేరుకుపోతూ ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది.

సాధారణంగా బరువు పెరగడం ప్రపంచ దేశాలన్నిటిలో కనిపిస్తున్న అత్యంత సాధారణమైన ఆరోగ్య సమస్య. మహర్షి చరకుడు రాసిన చరకసంహితంలో ఈ సమస్యకు మేదోరోగం అనే పేరు ఉంది.

తొడలు, ఉదరం, ఛాతీ మొదలైన శరీర ప్రదేశాల్లో అడిపోజ్ కణజాల పరిమాణం పెరిగి, తద్వారా ఆరోగ్యం మీద దుష్ప్రభావం పడడమే ఊబకాయం అని ఆయుర్వేదం ఊబకాయాన్ని విశ్లేషించింది.

ఇందుకు కారణాలు

ప్రధానంగా అస్తవ్యస్థ ఆహారపుటలవాట్లు, జీవనశైలి, అలవాట్లే కారణం.

శరీరంలోకి వెళ్లే క్యాలరీలకు తగ్గట్టు శరీరం క్యాలరీలను ఖర్చు చేయకపోవడం మూలంగా అదనంగా మిగిలిపోయిన క్యాలరీలు శరీరంలో కొవ్వు రూపంలో పేరుకుపోతూ ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది.https://youtu.be/zngmWPSUPKg

వ్యాయామం లోపించడం

మొదటగా…వ్యాయామం లోపించడం, పగటివేళ నిద్ర, కఫాన్ని పెంచే పదార్థాలు అధిక కొవ్వులు, జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టే పదార్థాలు, నూనె, తీపి, ఉప్పు ఎక్కువగా కలిగి ఉండే ఆహారం తీసుకోవడం బరువు పెరగడానికి ప్రధాన కారణాలు.

ఆయుర్వేదం దృష్టిలో…

ఎక్కువ శాతం వ్యాధులకు మూలం ఆహారంలో ఉన్నట్టే, స్థూలకాయానికీ లోపించడం, పగటివేళ నిద్ర, కఫాన్ని పెంచే పదార్థాలు అధిక కొవ్వులు, జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టే పదార్థాలు, కాబట్టి నూనె, తీపి, ఉప్పు ఎక్కువగా కలిగి ఉండే ఆహారం తీసుకోవడం బరువు పెరగడానికి ప్రధాన కారణాలు.

ఆయుర్వేదం దృష్టిలో…

ఎక్కువ శాతం వ్యాధులకు మూలం ఆహారంలో ఉన్నట్టే, స్థూలకాయానికీ మూలం ఆహారంలోనే ఉంది.

సరికాని ఆహారం తీసుకోవడం, అస్తవ్యస్థ ఆహారపుటలవాట్లను అనుసరించడం, జీవనశైలి క్రమం తప్పడం మూలంగా జీర్ణాగ్నిలో హెచ్చుతగ్గులు ఏర్పడి ఆమ్లం పెరుగుదలకు దారి తీస్తుంది.

ఈ ఆమ్లం పెరిగితే శరీరం శక్తిని ఖర్చు చేసుకునే వేగం తగ్గి, కొవ్వు కణజాలం (మేథ ధాతు అగ్ని) అస్థి కణజాలం నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడతాయి. బలహీనంగా ఏర్పడిన కణజాల పొరలు అనవసర మేధ ధాతు (కొవ్వులు)లకు కారణమై కఫ పనితీరును అస్తవ్యస్థం చేస్తాయి.

మరో పక్క ఆమం శరీర కణజాల మార్గాలకు అడ్డుపడడంతో వాతంలో కూడా హెచ్చుతగ్గులు ఏర్పడతాయి.

వాత దోషం కేంద్ర జీర్ణాగ్నిని ప్రేరేపిస్తూ ఆకలిని పెంచుతుంది. ఫలితంగా వ్యక్తి అవసరానికి మించి తినేస్తూ ఉంటాడు.

ఇందుకు కారణం. మేధ దవాగ్ని మంధ్య (కొవ్వును శక్తిగా ఖర్చు చేయడంలో బలహీనత) పెరగడంతో అస్తవ్యస్థ మేధ ధాతు తయారవుతుంది. ఇదే ఊబకాయానికి మూల కారణం.

స్థూలకాయం లక్షణాలు

పొత్తికడుపులో కొవ్వు పేరుకుపోవడం, నిస్సత్తువ, అధిక స్వేదం ఊబకాయుల్లో కనిపించే ప్రధానమైన లక్షణాలు. ఇవన్నీ ఆరోగ్య పరిస్థితి కుంటుపడింది అని చెప్పడానికి సూచనలు.

ఊబకాయుల్లో ఆకలి పెరిగి, దప్పిక, బలహీనత, శక్తి ఖర్చయ్యే వేగం కుంటుపడతాయి.https://youtu.be/zngmWPSUPKg

పొత్తికడుపు దగ్గర, మరీ ముఖ్యంగా స్త్రీ పురుషుల్లో నడుము పైభాగంలో ఎక్కువగా కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. శరీర కణజాలం సక్రమంగా ఏర్పడకపోవడం మూలంగా వీరిలో నిస్సత్తువ ఆవరించి ఉంటుంది.

ఈ లక్షణాలను చికిత్సతో సరిదిద్దకపోతే హైపర్టెన్షన్, కొలెస్ట్రాల్ పెరగడం, హృద్రోగాలు, ఛాతీలో మంట, మూత్రపిండాల సమస్యలు, మధుమేహం, కీళ్ల నొప్పులు, ఆయుష్షు తగ్గడం, వృద్ధాప్య ఛాయలు త్వరగా కనిపించడం, మానసిక అయోమయం మొదలైన సమస్యలు తలెత్తుతాయి.

ఊబకాయం చికిత్స

ఆయుర్వేద చికిత్స కేవలం స్థూలకాయాన్ని తగ్గించడమే ప్రధానంగాకాకుండా, శరీరం శక్తిని ఖర్చు చేసే వేగాన్ని పెంచడమే ఉద్దేశంగా పని చేస్తుంది. ఇందుకోసం ఆమం తగ్గించి, కఫం దోషాన్ని సమం చేయడం ఆయుర్వేద చికిత్సా విధానంలో అనుసరించే ముఖ్య విధానం. https://youtu.be/0GA9k7lK9Mw

శరీరం శక్తిని ఖర్చు చేసే వేగాన్ని పెంచడం కోసం జీర్ణ, కణజాల అగ్నిని బలపరిచి, శరీరంలో ప్రవాహ మార్గాల్లోని అడ్డంకులను తొలగిస్తుంది.

ఇందుకోసం అస్తవ్యస్థ ఆహారపుటలవాట్లను సరిచేసి, ఒత్తిడి ప్రభావాన్ని శరీరం మీద నుంచి తప్పించే దిశగా ఆయుర్వేద వైద్యం సాగుతుంది.

ద్రవాహారాలతో….

తీపితో కూడిన శీతల పానీయాల స్థానంలో పళ్లరసాలు, చల్లని పానీయాలకు బదులుగా 35 నుంచి 36 డిగ్రీల వేడితో కూడిన స్వచ్ఛమైన నీళ్లు తాగవలసి ఉంటుంది.

భోజనానికి కనీసం 48 నిమిషాల పాటు వేడి నీళ్లను కొద్ది పరిమాణాల్లో తాగుతూ ఉండడం ద్వారా జీర్ణాగ్ని ప్రేరేపితమై ఆకలిని అణచివేస్తుంది. దాంతో వాత దోషం చలనం తేలిక అవుతుంది.https://youtu.be/w6n7CiVxqIw

వేడి నీటి ఉపవాసం

వారానికి ఒక రోజు ఉపవాసం వల్ల పేగులు బాగుపడతాయి. జీర్ణ వ్యవస్థ పునరుత్తేజం అవుతుంది. శరీరం శోషించుకోకుండా మిగిలిపోయిన పదార్థాలు జీర్ణాగ్ని సహాయంతో తిరిగి జీర్ణం అవుతాయి.

పెసలు, మినుములతో తయారుచేసిన సూప్ కూడా వేడి నీటి బదులుగా తాగవచ్చు.

ఇందుకోసం ఒక పెద్ద చెంచా పొట్టుతో కూడిన పెసరపప్పును 750 మిల్లీ లీటర్ల నీటిలో ఉడికించి, ఆ నీరును తాగుతూ ఉండాలి.

తినే విధానం

ఆహారాన్ని తినేటప్పుడు మెదడు పదార్థాల రుచి, వాసన, పదార్థం రకాలను గ్రహించి ఉదరానికి సందేశాలు పంపి, జీర్ణ రసాలు తయారై పదార్థం జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది.

https://youtu.be/0V-EKr7QS0s ప్రయాణించే సమయంలో తినడం లేదా టీవీ చూస్తూ, సమావేశాల్లో కూర్చుని తినడం వల్ల జీర్ణ ప్రక్రియ బరువు తగ్గే ప్రయత్నాలను కుంటుపరుస్తుంది. కాబట్టి ఆహారం తీసుకునేటప్పుడు ఆదరాబాదరాగా కాకుండా ప్రశాంతంగా ప్రశాంతంగా తగిన సమయాన్ని కేటాయించాలి. తినే పదార్థాల రుచి, వాసన, రకాలను ఆస్వాదించాలి.

ఆమపచనం

ఆమం ఉన్నప్పుడు బరువు తగ్గడం అసాధ్యం. ఈ కారణం వల్లే ఎక్కువ మంది తీసుకునే ఆహారం తగ్గించినా బరువు తగ్గలేకపోతూ ఉంటారు. కాబట్టి మొదట శరీరంలోని ఆమాన్ని తగ్గించి, తర్వాత బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. ఇందుకో ఆమాన్ని తగ్గించే మూలికలను తీసుకోవచ్చు. అవేంటంటే…

*పసుపు

*త్రికటు (అల్లం, మిరియాలు, పిప్పలి)

*త్రిఫల (అమలాకి, బిభితాకి, హరితాకి)

***************************************************************************************************************

స్థూలకాయం (బరువు) తగ్గాలంటే… ఈ 5 ముఖ్యమైన విషయాలు పాటించండి 👇

1️⃣ ఆహార నియంత్రణ – ఎక్కువ నూనె, చక్కెర, ఫాస్ట్ ఫుడ్ తగ్గించి కూరగాయలు, పండ్లు, ధాన్యాలు ఎక్కువగా తీసుకోండి.

2️⃣ నిత్య వ్యాయామం – రోజూ కనీసం 30 నిమిషాలు నడక, యోగ, లేదా ఏదైనా శారీరక వ్యాయామం చేయండి.

3️⃣ నీరు ఎక్కువగా త్రాగడం – రోజుకు 8–10 గ్లాసుల నీరు త్రాగితే శరీరంలోని కొవ్వు కరుగుతుంది.

4️⃣ సమయానికి నిద్ర – రోజుకు 7–8 గంటలు నిద్రపోతే మెటబాలిజం సరిగా పనిచేస్తుంది.

5️⃣ ఒత్తిడి తగ్గించుకోవడం – ధ్యానం, ప్రాణాయామం చేయడం వల్ల బరువు తగ్గడం సులభమవుతుంది.

క్రమమైన ఆహారశైలి

కఫంతో పాటు అధిక కొవ్వు కణజాలం తగ్గడానికి తోడ్పడే వాత వ్యతిరేక ఫలితాన్ని అందించే ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం తీసుకునే పదార్థాలన్నీ పొడిగా, తేలికగా జీర్ణమయ్యేవి అయి ఉండాలి. వీటిలో నూనెలు, కొవ్వులు తక్కువ ఉండాలి. శరీర తత్వానికి తగినది, శుద్ధి చేసిన, కొవ్వు కరగడానికి తోడ్పడే సుగంధద్రవ్యాలు జోడించిన ఆహారాన్ని తీసుకోవాలి. దాల్చినచెక్క, మిరియాలు, పసుపు, ధనియాలు ఆహారానికి జోడించాలి. జీర్ణక్రియ సక్రమంగానే ఉన్న పిత్త దోష వ్యక్తులు పచ్చి కూరగాయలను తినవచ్చు.

నిద్ర అవసరం

అధిక బరువు తగ్గించుకోవడానికి ఎంత వ్యాయామం అవసరమో, సరిపడా నిద్ర కూడా అంతే అవసరం. అస్తవ్యస్థ నిద్ర అలవాట్లు ఆహారపుటలవాట్లనూ దెబ్బతీస్తాయి. కారణంగా…అవసరానికి మించి ఎక్కువగా తినేస్తూ ఉంటాం.

అందువల్ల నిద్ర లేమి రక్తపోటు, మధుమేహం, ఛాతీలో మంట మొదలైన మెటబాలిజంతో సంబంధం ఉన్న సమస్యలకు కారణం అవుతుంది.

శారీరక వ్యాయామం

బరువు తగ్గే ప్రక్రియలో వ్యాయామం కీలకం. శరీరంలో నిల్వ ఉండిపోయిన అదనపు క్యాలరీలను వ్యాయామంతో ఖర్చు చేయవచ్చు. వ్యాయామంతో శరీరంలో ఒత్తిడి తొలగి, కండరాలు శక్తి పొందుతాయి.https://youtube.com/shorts/yTzQMTw1Wd4 క్రమం తప్పక ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడవడం ‘అలవాటు చేసుకుంటే తర్వాత పరుగు, ఈత మొదలైన అధిక శ్రమతో కూడిన వ్యాయామాలకు అలవాటు పడే వీలుంటుంది. కాబట్టి బద్ధకాన్ని వదిలి నడకతో వ్యాయామాన్ని ఆరంభించాలి.

మర్దనం, ఉద్వర్తనం

పొడి మర్దన (మర్దనం), త్రిఫల, ఇతరత్రా చూర్ణాలతో కూడిన మర్దన (ఉద్వర్తనం)తో అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఉద్వర్తన చికిత్స అత్యంత సాధారణ ఆయుర్వేద విధానం. చూర్ణాలు, నూనెలతో కూడిన ఈ మర్దన చికిత్స శరీరం శక్తి ప్రవాహ మార్గాల అడ్డంకులను, శరీరంలో బిగుతును తొలగిస్తుంది. మూలికలు, నువ్వల నూనెతో కలిపి చేసే ఈ మర్దన చికిత్స వల్ల కొవ్వు కణజాలం కరగడంతో పాటు చర్మం నునుపు తేలుతుంది.https://youtu.be/PLKkRpKlgSw

ఈ మర్దనలో వాడే మూలికా మిశ్రమంతో చర్మరంధ్రాలు తెరుచుకుని, కణజాలం వెచ్చబడి, కొవ్వును కరిగించే శరీర జీవక్రియ వేగవంతం అవుతుంది.

సైంధవాది తైలాలు…

సైంధవాది తైలాలు వీటితో మర్దన తర్వాత ఆవిరి స్నానం చేయవలసి ఉంటుంది.అవిరి స్నానంలో ప్రత్యేకమైన మూలికలు వాడతారు. అవిరి స్నానంతో శరీరం నుంచి మలినాలు విసర్జింపబడతాయి.

ములికల మిశ్రమం చర్మరంధ్రాల్లోకి చొరబడుతుంది. ఫలితంగా చర్మ అడుగున, కండరాలు, అంతర్గత అవయవాల చుట్టూ పేరుకున్న కొవ్వు కరగడం మొదలు పెడుతుంది.

అందువల్ల పంచకర్మ చికిత్సల్లో భాగంగా చేసే మర్దన, అభ్యంగాల చర్మం శుభ్రపడడంతో పాటు, శరీర దుర్గంధం దూరమవుతుంది.

బస్తి

శరీర తత్వాన్ని బట్టి త్రిఫలాలతో కూడిన లేఖన బస్తి చేయవలసి ఉంటుంది. వాతం పెరగకుండా కఫం, పిత్త దోషాలు సమం చేయబడతాయి. ఫలితంగా బరువు పెరగడానికి కారణమయ్యే పరిస్థితి సమసిపోతుంది.

బస్తి చికిత్స వాత శక్తికి తోడ్పాటు అందిస్తుంది. బస్తి చికిత్సలో వాడే నూనెలు, కొవ్వులు కఫాన్ని తగ్గించి, శరీరం నుంచి ఆమ విషాలను బయటకు వెళ్లగొట్టి, శరీరం కొవ్వును కరిగించుకునే వేగాన్ని పెంచుతాయి.

పత్యం – అపత్యం

బాహుమూలాలు, నుదుటన చమటలు పట్టేలా నడక, పరుగు, సైకిల్ తొక్కడం, ఈత, బరువులు ఎత్తే వ్యాయామాలు చేయాలి. వీటితో పాటు యోగాభ్యాసాలూ సాధన చేయవచ్చు. అవేంటంటే….

సంక్షేపంగా….మొత్తంగాచివరగా

సూర్యనమస్కారం: శరీర మెటబాలిజం క్రమంగా పనిచేయడం కోసం

తాడాసనం: శరీరాకృతిని సరి చేయడం కోసం

పశ్చిమోత్తాసనం: శరీరాన్ని కాళ్లవైపు వంచి కూర్చునే ఆసనం. అర్థబద్ధ పద్మపశ్చిమోత్తాసనం, ఊర్ధ్వముఖ పశ్చిమోత్తాసనం, పరివర్త పశ్చిమోత్తాసనం శరీరాన్ని సాగదీయడానికి ఉపయోగకరం.

వనముక్తాసనం: పేగులు, మూత్రవ్యవస్థ, గర్భాశయం మొదలైన కటి ప్రదేశంలో ఉండే అవయవాలను ఈ ఆసనం ప్రేరేపిస్తుంది.

భుజంగాసనం: పొత్తికడుపు దగ్గర ఉండే అవయవాలు ప్రేరేపితం అవుతాయి.

ధనురాసనం: పొత్తికడుపు దగ్గర ఉండే కొవ్వు కరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *