తాజావార్తలు

పవన్ కళ్యాణ్‌ను పరామర్శించనున్న ప్రధాని మోదీ.. అదే సమయంలో చిరంజీవి రాక..!

పవన్ కళ్యాణ్‌ను పరామర్శించనున్న ప్రధాని మోదీ.. అదే సమయంలో చిరంజీవి రాక..!


హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ప్రాంతం రేపు ఒక కీలకమైన భేటీకి వేదిక కాబోతోంది. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, వైద్యుల సూచన మేరకు తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచ్చేస్తున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధాని నేరుగా పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకోనున్నారు.

ఈ పర్యటన కేవలం పరామర్శకే పరిమితం కాకుండా, రాజకీయంగానూ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఏపీ అభివృద్ధిపై కూడా ఇరువురు చర్చించే అవకాశం ఉంది. ప్రధాని పర్యటన సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ నివాసానికి వస్తుండటం విశేషం. తన తమ్ముడిని పరామర్శించేందుకు వస్తున్న మోదీకి చిరంజీవి స్వాగతం పలకనున్నారు. ప్రధాని, పవన్ కళ్యాణ్, చిరంజీవి మధ్య జరగనున్న ఈ భేటీ పై అటు సినీ పరిశ్రమలో, ఇటు రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో మాదాపూర్, పవన్ కళ్యాణ్ నివాస పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ఎస్పీజీ (SPG) బృందాలు అక్కడ చేరుకుని భద్రతా ఏర్పాట్లను సమీక్షించాయి. ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో పాటు, భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ పట్ల కేంద్రం చూపిస్తున్న ఈ ప్రత్యేక చొరవ రాజకీయంగా పవన్‌కు దక్కిన పెద్ద గౌరవంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *