బాంబుల మోతతో ఉలిక్కిపడ్డ బీదర్.. ముగ్గురు చిన్నారులతో సహా 8 మందికి తీవ్ర గాయాలు
కర్ణాటకలోని బీదర్ జిల్లాలో శనివారం (జనవరి 31) పేలుళ్లు తీవ్ర కలకలం రేపాయి. ముగ్గురు చిన్నారులతో సహా 8 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై కర్నాటక ప్రభుత్వం ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. మొలిగే మారయ్య ఆలయానికి వెళ్లే రోడ్డుపై ఈ సంఘటన జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో భయాందోళనలు చెలరేగాయి. కర్నాటక బీదర్ జిల్లా హుమ్నాబాద్ సమీపం లోని మొల్కేరా గ్రామంలో భారీ పేలుడు జరిగింది. భూమిలో…
