“ప్రాణాలు కాపాడే…Emergency sticker!
ఒక చిన్న స్టిక్కర్… సమయానికి మీ ప్రాణాలు కాపాడే సంజీవనిగా మారితే ఎలా ఉంటుంది? ఇసుకేస్తే రాలనంత రద్దీగా ఉండే నగరంలో మిమ్మల్ని ట్రాఫిక్ చిక్కుల నుంచి తప్పించి, మీ సమయాన్ని కూడా ఆదా చేస్తే? అంతకంటే ఏం కావాలి… ఇంతకీ ఆ మ్యాజిక్ స్టిక్కర్ సంగతులేంటంటే… అర్ధరాత్రి రోడ్డుపైన యాక్సిడెంట్… తీవ్రంగా రక్తస్రావం అవుతోంది. కొందరు ‘అయ్యోపాపం’ అంటుంటే, మరికొందరు వాళ్ల ఆత్మీయులకు సమాచారం చేరవేసి, మెరుగైన వైద్యం అందిద్దామని అనిపించినా- అతను ఎవరో ఏంటో…
