రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత సర్జరీ చేసి తొలగింపు
స్కూల్లో విద్యార్ధులు సరదాగా పందేలు వేసుకోవడం సహజం. అయితే అవి శృతి మించి ప్రాణాలమీదకు తెచ్చేలా ఉండకూడదు. అలాంటి ఘటనే జరిగింది గుంటూరులో. మూడేళ్ల క్రితం ఫ్రెండ్స్ సరదాగా వేసుకున్న పందెం కారణంగా ఓ యువకుడు తన ప్రాణాలమీదకు తెచ్చింది. గుంటూరు కొత్తపేటకు చెందిన శ్రీనివాసరావు దంపతుల కుమారుడు మురళీ క్రిష్ణ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పది రోజుల క్రితం భరించలేనంతగా కడుపునొప్పి వచ్చింది. కొడుకు నొప్పితో విలవిలలాడుతుంటే తల్లిదండ్రులు ఏం జరిగిందోనని కంగారు పడ్డారు….
