తాజావార్తలు

అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులు.. ఈదురు గాలులతో కూడిన వర్షాలు దాదాపు అన్ని ప్రాంతాల్లో కురుస్తాయని వెల్లడించింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, జార్ఖండ్, వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం, ఈ రోజు (24 ఆగస్టు 2026) ఉదయం 08:30 గంటలకు గంగా తీర పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న జార్ఖండ్, ఉత్తర ఒడిశా ప్రాంతాలపై కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న చక్రవాత ఆవర్తనం (cyclonic circulation) సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండి, ఎత్తు పెరిగేకొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో జార్ఖండ్, ఉత్తర ఒడిశా మీదుగా దాదాపు వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది.

దీంతోపాటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి (Monsoon trough) ప్రస్తుతం అమృత్‌సర్, నజీబాబాద్, షాజహాన్‌పూర్, వారణాసి, గంగా తీర పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న జార్ఖండ్, ఉత్తర ఒడిశా ప్రాంతాలపై ఉన్న అల్పపీడన కేంద్రం మీదుగా, అక్కడి నుండి ఆగ్నేయ దిశగా ఉత్తర బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది.

వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో మంగళవారం, బుధవారం జోరుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

అంతేకాకుండా.. పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

రాబోయే 3 గంటల్లో పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కర్నూలు జిల్లాల్లోని ఒకటి లేదా రెండు చోట్ల మెరుపులు, గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *