టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న క్రేజీ హీరోయిన్లు.. పాన్ ఇండియా సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న కొత్త భామల లిస్ట్!
తెలుగు సినిమా పరిశ్రమ ఎప్పుడూ కొత్త ప్రతిభను ఆహ్వానించడంలో ముందుంటుంది. ప్రతి ఏటా ఎంతోమంది అందాల భామలు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నా, ప్రేక్షకులను మెప్పించి ఇక్కడ పాగా వేయడం మాత్రం అందరికీ సాధ్యం కాదు. అయితే ఈ ఏడాది వెండితెరపై మెరవబోతున్న కొందరు అమ్మాయిల జాతకం చూస్తుంటే, వారు గ్లామర్ తోనే కాకుండా నటనా నైపుణ్యంతోనూ స్టార్ హీరోయిన్లుగా ఎదిగే అవకాశం కనిపిస్తోంది. ఒకరు ఏకంగా రెబల్ స్టార్ సరసన పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నటిస్తుండగా, మరొకరు…
