గుడ్‌న్యూస్.. ఇక బుక్ చేసిన 3 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్! ఇలా బుక్ చేయసుకోండి..
ఎల్‌పీజీ వినియోగదారులకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు ఇండియన్ ఆయిల్ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ పేరుతో ప్రారంభించిన ఈ సేవ ద్వారా బుకింగ్ చేసిన కేవలం మూడు గంటల్లోనే 10 కేజీల కాంపోజిట్ ఎల్‌పీజీ సిలిండర్‌ను ఇంటికే డెలివరీ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ అనేది ఆధునిక గృహ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన 10 కేజీల కాంపోజిట్ ఎల్‌పీజీ సిలిండర్. సాధారణ స్టీల్ సిలిండర్లతో పోలిస్తే…
