ఇరాన్ లొంగకపోతే, నౌకాదళ దిగ్బంధనం విధిస్తాం.. వెనిజులా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేస్తాంః ట్రంప్
అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో, ఇరాన్ అమెరికాకు తలొగ్గడానికి నిరాకరించింది. ఈ రెండు దేశాల భవిష్యత్ కార్యాచరణపై అందరి దృష్టి నెలకొంది. ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ చర్చలు ఒప్పందం లేకుండా ముగిసిన తర్వాత, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్’ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో కీలక ప్రకటన చేశారు. అమెరికా డిమాండ్లను ఇరాన్ పాటించడానికి నిరాకరిస్తే, ట్రంప్ నావికా దిగ్బంధనాన్ని విధించవచ్చని పేర్కొన్నారు. ట్రంప్‌నకు అనుకూలమైన మీడియా సంస్థ “జస్ట్ ది న్యూస్” నుండి వచ్చిన…
