IND Vs PAK: వర్షంతో భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే.. గ్రూప్ స్టేజిలో టాప్ ప్లేస్ వీరిదే
టీ20 వరల్డ్‌కప్ 2026లో అత్యంత కీలకమైన, ఉత్కంఠభరితమైన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రియులకు పెద్ద పండగే. అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోవడం, నినాదాలతో దద్దరిల్లిపోవడం సాధారణం. ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై మొదటి నుంచే ఒక సందిగ్ధత కొనసాగుతూ వస్తోంది. కొద్ది రోజుల ముందు పాకిస్తాన్ ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పెద్ద హైడ్రామా సృష్టించిన…
