ఏకాదశి వ్రతాలలో అత్యంత పవిత్రమైనదిగా భావించే ‘నిర్జల ఏకాదశి’ ఈ ఏడాది జూన్ 25న ఆచరించబడనుంది. ఈ వ్రతాన్ని అత్యంత కఠినంగా పాటిస్తారు. రోజంతా నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండటం దీని ప్రత్యేకత. శ్రీమహావిష్ణువుకు అంకితమైన ఈ రోజున భక్తులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తారు. అయితే 2026 నిర్జల ఏకాదశి జ్యోతిష్యపరంగానూ విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రోజున ‘శని, శుక్ర గ్రహాల అనుకూల స్థితి కారణంగా నవపంచమ రాజయోగం’ ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు స్నేహపూర్వక గ్రహాల ప్రభావంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు.
