తాజావార్తలు

Lakshmipathi: ఈ టాలీవుడ్ కమెడియన్ గుర్తున్నాడా? పాపం ఎలా చనిపోయారో తెలుసా? ఆ బాధతోనే కుంగిపోయి చివరకు..

Lakshmipathi: ఈ టాలీవుడ్ కమెడియన్ గుర్తున్నాడా? పాపం ఎలా చనిపోయారో తెలుసా? ఆ బాధతోనే కుంగిపోయి చివరకు..


Lakshmipathi: ఈ టాలీవుడ్ కమెడియన్ గుర్తున్నాడా? పాపం ఎలా చనిపోయారో తెలుసా? ఆ బాధతోనే కుంగిపోయి చివరకు..

కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జుఉన హీరోగా నటించిన చంద్రలేఖ చిత్రానికి రచయితగా పనిచేశారు లక్ష్మీపతి. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ చూడాలని ఉంది’ చిత్రంలో మెదటిసారిగా తెరపై కనిపించారు. ఈవీవీ తెరకెక్కించిన ‘ అల్లరి’ సినిమా లక్ష్మీపతికి మంచి బ్రేక్ తీసుకొచ్చింది. ఇక ఆయన సోదరుడు శోభన్ డైరెక్షన్ లో మహేష్ హీరగా రూపొందిన బాబీ చిత్రలో విలన్ గానూ ఆకట్టుకున్నారాయన. మురారి, జయం, నీ స్నేహం, జెమిని, తొట్టి గ్యాంగ్, జూనియర్స్, నిజం, అమ్మాయిలు అబ్బాయిలు, నిన్నే ఇష్టపడ్డాను, కల్యాణ రాముడు, ఆడంతే అదో టైపు, ఎవడి గోల వాడిదే, పెదబాబు, ఆ నలుగురు, ఆంధ్రుడు, అత్తిలి సత్తిబాబు ఎల్ కేజీ.. ఇలా దాదాపు 70 సినిమాల్లో నటించారు. కాగా సినిమాల్లో బిజీ బిజీగా ఉండగానే లక్ష్మీ పతి కన్నుమూశారు. 2008 ఫిబ్రవరి 07న ఆయన గుండెపోటుతో కన్నుమూశారని సమాచారం. అప్పటికింకా ఆయన వయసు కేవలం 50 ఏళ్లు మాత్రమే. అప్పట్లో లక్ష్మీపతి ఎంత బిజీగా ఉన్నారంటే ఆయన చనిపోయాక కూడా దాదాపు ఆరు సినిమాలు రిలీజ్ కావడం గమనార్హం.

లక్ష్మీపతి కుమారులు సంగీత్, సంతోష్ శోభన్ లిద్దరూ ఇప్పుడు టాలీవుడ్ లో హీరోగా రాణిస్తున్నారు. అయితే ఆయనకు శ్వేతా అనే ఒక కూతురు కూడా ఉంది. ఆ మధ్యన ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూకు హాజరైన శ్వేత తన తండ్రి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘నాన్న చనిపోయిన సమయంలో నేను రేడియో సిటీలో పనిచేస్తుండేదాన్ని. ఆయన మరణవార్త విజయవాడ బస్సులో న్యూస్ పేపర్ చదువుతుండగా తెలిసింది. నాన్నకు అనారోగ్య సమస్యలు ఉండేవి. తరచుగా జబ్బు పడేవారు. అయితే శోభన్ (లక్ష్మీపతి సోదరుడు, వర్షం సినిమా డైరెక్టర్) గారి మరణం నాన్నను బాగా డిప్రెషన్‌కు గురి చేసింది. నాన్న చాలా సున్నితమైన వ్యక్తి. ఆయన ఎక్కడా అప్పులు చేయలేదు’ అని శ్వేత చెప్పుకొచ్చింది.

కాగా సోదరుడు శోభన్ చనిపోయిన కొద్ది రోజులకే లక్ష్మీపతి కూడా కన్నుమూయడం గమనార్హం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *