తాజావార్తలు

టీమిండియా దిగ్గజ ప్లేయర్‌కు ఇచ్చిపడేసిన వైభవ్.. నాలో మరో యాంగిల్ త్వరలోనే చూస్తారంటూ షాక్..!

టీమిండియా దిగ్గజ ప్లేయర్‌కు ఇచ్చిపడేసిన వైభవ్.. నాలో మరో యాంగిల్ త్వరలోనే చూస్తారంటూ షాక్..!


ఐపీఎల్ 2026 సీజన్‌లో తన ముక్కుసూటి బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచిన రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీపై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టోర్నీలో అన్ని అవార్డులు కొల్లగొట్టిన వైభవ్‌ను ఫోర్ల విషయంలో అశ్విన్ ఆటపట్టించగా, ఆ కుర్రాడు ఇచ్చిన సమాధానం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

ఐపీఎల్ వేదికపై ‘వైభవం’.. ఆరెంజ్ క్యాప్‌తో సరికొత్త చరిత్ర..!

భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన ఆవిష్కరణగా నిలిచాడు 15 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున బరిలోకి దిగిన ఈ టీనేజ్ సంచలనం, ఈ ఏడాది ఐపీఎల్‌లో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆడిన 16 మ్యాచ్‌ల్లో ఏకంగా 776 పరుగులు సాధించి, ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచి ప్రతిష్టాత్మక ‘ఆరెంజ్ క్యాప్’ సొంతం చేసుకున్నాడు. రియాన్ పరాగ్ నాయకత్వంలోని రాజస్థాన్ క్వాలిఫైయర్-2 వరకు వచ్చి ఓడిపోయినప్పటికీ, వైభవ్ ఆటతీరు మాత్రం అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. సీజన్ ముగిసేసరికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్, సూపర్ సిక్సెస్ వంటి అగ్రశ్రేణి అవార్డులన్నీ ఈ చిన్నారి ఖాతాలోనే చేరాయి.

ఇది కూడా చదవండి: తోపులుగా వచ్చి తుస్సుమన్న ఐదుగురు.. పద్ధతిగా రిటైర్మెంట్‌ చేస్తే పరువైనా మిగిలేనుగా..!

‘నువ్వు ఫోర్లు కొట్టలేదుగా’.. అశ్విన్ సరదా సెటైర్..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం అవార్డుల ప్రదానోత్సవంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ వైభవ్‌తో మాట్లాడుతూ.. “ఈ సీజన్‌లో నువ్వు దాదాపు అన్ని అవార్డులూ గెలుచుకున్నావు. కానీ, అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడి అవార్డు మాత్రం నీకు రాలేదు కదా!” అంటూ నవ్వుతూ ఆటపట్టించాడు. కేవలం సిక్సర్లతోనే మైదానాన్ని హోరెత్తించిన ఈ యువ ఆటగాడిని సరదాగా కామెంట్ చేశాడు.

ఇది కూడా చదవండి: Video: ఆర్సీబీకి దిమ్మతిరిగే షాక్.. స్టార్ ప్లేయర్‌పై నిషేధంతోపాటు జరిమానా..!

టెస్ట్ క్రికెట్టే నా అసలు లక్ష్యం.. కుర్రాడి నోట పరిణతి గల మాట!

అశ్విన్ వేసిన ఈ సెటైర్‌కు వైభవ్ సూర్యవంశీ ఎంతో పరిణతితో సమాధానమిచ్చాడు. “నిజమే సర్, నా తదుపరి లక్ష్యం వన్డే, టెస్ట్ ఫార్మాట్లు. అందుకోసం నేను మైదానంలో నిలకడగా ఆడటంపై దృష్టి పెడుతున్నాను. నేను రెడ్ బాల్‌తో చాలా కాలంగా కఠినమైన ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు, కానీ త్వరలోనే అందరూ నాలోని మరో కొత్త కోణాన్ని చూస్తారు” అని ధీమాగా చెప్పాడు.

ఇది కూడా చదవండి: లక్ అంటే వీళ్లదే భయ్యా.. ఒక్క మ్యాచ్ ఆడకుండా అకౌంట్‌లోకి కోట్ల వర్షం.. లిస్ట్ చూస్తే అవాక్కే..!

తన దూకుడైన ఆటతీరుపై వస్తున్న విమర్శలకు కూడా వైభవ్ గట్టిగానే బదులిచ్చాడు. “నేను ప్రతి బంతిని సిక్సర్ కొట్టడానికే చూస్తానని చాలామంది అనుకుంటారు. కానీ ఇది టీ20 ఫార్మాట్. కోచ్‌లు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. బంతిని సరిగ్గా బాదగలననే నమ్మకం నాలో బలంగా ఉండబట్టే నేను ఆ షాట్లకు ప్రయత్నిస్తాను. టెస్ట్ క్రికెట్ ఆడటమే నా పరమావధి అని మా నాన్న నాకు చిన్నప్పటి నుంచే నేర్పించారు. రంజీ ట్రోఫీలో నాకు ఎక్కువ అవకాశాలు రాలేదు, అది నాకు సవాలుగా నిలిచింది. కానీ నా ఆటను మరింత మెరుగుపరుచుకుని భారత్ తరపున టెస్ట్ మ్యాచ్‌ల్లో రాణిస్తాను” అని వైభవ్ స్పష్టం చేశాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *