తాజావార్తలు

Gold Prices: బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. దెబ్బకు సీన్ రివర్స్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

Gold Prices: బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. దెబ్బకు సీన్ రివర్స్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?


Gold Prices: బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. దెబ్బకు సీన్ రివర్స్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

బంగారం ధరలు కొనుగోలుదారులకు మరోసారి షాకిచ్చాయి. ధరలు గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం నుంచి ధరల పెరుగదుల నమోదవుతోంది. బుధవారం రూ.వెయ్యి పెరగ్గా.. గురువారం కూడా స్వల్పంగా హైక్ అయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే ధరలు పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. గురువారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

గోల్డ్ రేట్లు ఇలా..

-హైదరాబాద్‌లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,59,930 వద్ద కొనసాగుతోండగా.. బుధవారం రూ.1,59,440 వద్ద స్ధిరపడింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ ఒక్కసారిగా రూ.490 పెరిగింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,46,600గా ఉండగా.. నిన్న రూ.1,46,150 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే నేడు రూ.450 పెరిగింది.

-ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,61,670 వద్ద కొనసాగుతోండగా.. నిన్న రూ.1,60,910 వద్ద స్థిరపడింది. నిన్నటితో చూసుకుంటే ఏకంగా రూ.760 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,48,100 వద్ద కొనసాగుతోండగా.. బుధవారం రూ.1,47,500 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే గురువారం రూ.600 పెరిగిందని చెప్పవచ్చు.

-అలాగే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,60,230 వద్ద ఉండగా.. నిన్న రూ.1,59,590 వద్ద స్ధిరపడింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,46,750 వద్ద కొనసాగుతోంది.

-బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,59,930 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,46,600 వద్ద కొనసాగుతోంది

వెండి ధరలు ఇలా..

-ఇక వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. బెంగళూరులో కిలో సిల్వర్ ధర రూ.2.85 లక్షల వద్ద కొనసాగుతోంది. నిన్న ఇది రూ.2.80 లక్షలుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే నేడు ఏకంగా రూ.5 వేలు పెరిగింది.

-చెన్నైలో కేజీ సిల్వర్ రేటు రూ.2.90 లక్షలుగా ఉండగా.. నిన్న రూ.2.85 లక్షల వద్ద ఉంది. ఇవాళ ఒక్కరోజే రూ.5 వేలు పెరిగిందని చెప్పవచ్చు.

-హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.90 లక్షల వద్ద ఉండగా.. బుధవారం రూ.2.85 లక్షల వద్ద స్థిరపడింది. ఇవాళ రూ.5 వేలు పెరిగిందని చెప్పవచ్చు. విజయవాడ. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి

-ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.85 లక్షలుగా ఉండగా.. నిన్న రూ.2.80 లక్షల వద్ద ఉంది. ఇవాళ ఒక్కరోజే రూ.5 వేలు పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *