తాజావార్తలు

వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు

వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు


హైదరాబాద్‌లోని చెంగిచర్ల కాలనీలో సంక్రాంతి పండుగ సమయంలో భారీ దొంగతనం జరిగింది. పండుగకు ఊళ్లకు వెళ్లిన వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, అంతర్రాష్ట్ర దొంగల ముఠా తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో 10 ఇళ్లలో చోరీకి పాల్పడింది. దొంగలు కత్తులతో కాలనీలో సంచరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ చోరీలో నగదు, నగలు అపహరించినట్లు తెలుస్తోంది. దొంగతనం జరిగిన తీరును బట్టి నిందితులు ముందుగానే రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరా దృశ్యాల్లో ముగ్గురు దొంగలు మంకీ క్యాప్‌లు, మాస్క్‌లు ధరించి కనిపించారు. వీరిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను పోలీసులు రంగంలోకి దించారు.

మరిన్ని వీడియోల కోసం :

టాలీవుడ్ కు సెకండ్ హోమ్ గా మారుతున్న జపాన్ వీడియో

కర్మకాండకు రెడీ చేస్తుండగా.. బతికే ఉన్నానంటూ ఫోన్‌!

టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్‌ ఎక్కండి!

రైలు 2 గంటలు లేటైతే అవన్నీ ఫ్రీ… IRCTC రూల్ మీకు తెలుసా?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *