ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఎస్‌ఆర్‌హెచ్.. ఆర్‌ఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మంచి బ్యాటింగ్ పిచ్‌పై 15 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవన్షీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఏకంగా సెంచరీతో చెలరేగాడు. కేవలం 37 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్సులతో 103 పరుగులు చేసి అదరగొట్టాడు.
జైస్వాల్ రూపంలో ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆరంభంలోనే వికెట్ దక్కినా వైభవ్, ధృవ్ జురెల్ అద్బుతంగా ఆడి రెండో వికెట్ సెంచరీ ప్లస్ భాగస్వామ్యం నెలకొల్పారు. జురెల్ సైతం 35 బంత్లోల 51 పరుగులు చేసి రాణించాడు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆర్‌ఆర్ 6 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగా 2, హింగే, ప్యాట్‌కమిన్స్, షకీబ్ హుస్సేస్, నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీసుకున్నారు. ఇక 229 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.
కానీ మరో ఓపెనర్ అభిషేక్ శర్మ, వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషాన్ అద్భుతంగా ఆడారు. పోటాపోటీగా బౌండరీలు బాదుతూ ఇద్దరూ కూడా 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీలు పూర్తి చేసి, సెంచరీ ప్లస్ భాగస్వామ్యంతో విజయాన్ని దాదాపు ఖాయం చేశారు. మొత్తంగా అభిషేక్ 29 బంతుల్లో 11 ఫోర్లు ఒక సిక్స్‌తో 57, ఇషాన్ 31 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సులతో 74 పరుగులు చేసి మ్యాన్ ఎస్‌ఆర్‌హెచ్ చేతుల్లో పెట్టారు. చివర్లో వికెట్లు పడినా.. క్లాసెన్ 29, నితీష్ కుమార్ రెడ్డి 18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 36 పరుగులు చేసిన విజయాన్ని ఖాయం చేసి, గెలుపు ముంగిట వెనుదిరిగారు. మొత్తంగా 18.3 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసి సన్‌రైజర్స్ విజయం సాధించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
