కావాల్సిన పదార్ధాలు : కేజీ ఫారం కోడి ముక్కలు, అర కిలో బాస్మతి బియ్యం, మూడు ఉల్లిపాయలు, రెండు టమోటాలు, 4 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పు పెరుగు, పుదీనా, కొత్తిమీర – తగినంత, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ మసాలా పొడి, అర టేబుల్ ధనియాల పొడి, బిర్యానీ ఆకు, రెండు లవంగాలు, మూడు యాలకులు, దాల్చినచెక్క తీసుకోవాలి.
ముందుగా ఫారం కోడి ముక్కలను తీసుకుని వాటిని బాగా కడిగి, దానిలో అర టేబుల్ స్పూన్ వేసి రెండు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో ఈ కోడి ముక్కలు వేసి కొద్దిగా పెరుగు, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీనిలో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.
బాస్మతి బియ్యాన్ని ముందుగా ఒక గంట నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని వంపి, దానిలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి నీటిలో బాగా ఉడికించాలి. ఆ తర్వాత వీటిని వంపి పక్కన పెట్టాలి. ఇలా చేయడం వలన ఈ గింజలు పొడి పొడిగా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ఇలా చేయండి. అప్పుడు మీకు తేడా తెలుస్తుంది.
పచ్చిమిర్చి, కట్ చేసిన టమోటా ముక్కలు వేసి కొద్దీ సేపటి తర్వాత ముందుగా మ్యారినేట్ కోడి ముక్కలు కూడా దీనిలో వేసి మీడియం మంటపై బాగా ఉడికించాలి. చికెన్ మెత్తగా ఉడికే వరకు పొయ్యి మీదే ఉంచుకోవాలి. ఇంకా వీటిని ప్రతి 5 నిముషాలకొకసార
కలుపుతూ ఉండాలి ఇలా చేస్తే అడుగు అంటకుండా ఉంటుంది.
చివర్లో వీటిని వేయండి: చికెన్ ముక్కలు బాగా ఉడికిన తర్వాత వీటిలో ఉడికించిన బియ్యం పోసి బాగా తిప్పుతూ ఉండాలి. ఇంకా దీనిలో ఇప్పుడు అర కట్ట పుదీనా ఆకులు, ఒక కప్పు కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి, రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇవి బిర్యానీకి మంచి రుచిని ఇస్తాయి.





