Vaibhav Suryavanshi: ఐపీఎల్ వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచంలో ఒక అసాధారణ ప్రతిభగా ఎదిగాడు. ఐపీఎల్ 2026 లో రాజస్థాన్ రాయల్స్ తరపున కేవలం 14 ఏళ్ల 23 రోజుల వయసులోనే అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. తన మొదటి మ్యాచ్ లోనే శార్దూల్ ఠాకూర్ వేసిన తొలి బంతికే సిక్సర్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేవలం మూడో ఐపీఎల్ మ్యాచ్ లోనే గుజరాత్ టైటాన్స్ పై 35 బంతుల్లోనే సెంచరీ బాది యూసుఫ్ పఠాన్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టాడు.
కేవలం ఐపీఎల్ లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ వైభవ్ తన సత్తా చాటాడు. ఇటీవల జరిగిన అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ లో ఇంగ్లాండ్ పై కేవలం 80 బంతుల్లోనే 15 సిక్సర్లు 15 ఫోర్లతో 175 పరుగులు చేసి భారత్ కు ప్రపంచకప్ అందించాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పర్యటనల్లోనూ స్థిరమైన ప్రదర్శన చేసి తాను భవిష్యత్తు సూపర్ స్టార్ అని నిరూపించుకున్నాడు.
ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు ఆటగాడికి కనీసం 15 ఏళ్ల వయసు ఉండాలి. మార్చి 27 2026 నాటికి వైభవ్ 15వ ఏట అడుగుపెట్టాడు. దీంతో ఆయన అధికారికంగా టీమ్ ఇండియా సీనియర్ జట్టుకు ఎంపికయ్యేందుకు అర్హత సాధించాడు. గతంలో పాకిస్థాన్‌కు చెందిన హసన్ రజా అతి చిన్న వయసులో టెస్ట్ క్రికెట్ ఆడిన రికార్డు ఉంది. ఇప్పుడు వైభవ్ కూడా అదే బాటలో పయనిస్తున్నాడు.
రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలతో కలిసి ఆడే అవకాశం వైభవ్ కు త్వరలోనే రానుంది. ప్రస్తుతానికి రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్ 2026 లో వైభవ్ బిజీగా ఉన్నాడు. మార్చి 30న చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ లో ఆయన మళ్ళీ బరిలోకి దిగనున్నాడు. సెలెక్టర్లు ఈ యువ సంచలనానికి ఇప్పుడే అవకాశం ఇస్తారా లేదా మరికొంత కాలం వేచి చూస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్ 2026 కోసం సిద్ధమవుతోన్న వైభవ్ సూర్యవంశీ సిద్ధమవుతున్నాడు. అయితే, రానున్న వన్డే ప్రపంచకప్ 2027 కోసం టీమిండియా సెలెక్టర్లు ఈ బుడ్డోడిని కూడా లెక్కలోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ ఐపీఎల్ ప్రదర్శనతో బీసీసీఐ సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిలా మారే ఛాన్స్ ఉందనితెలుస్తోంది.





