తాజావార్తలు

పట్టపగలు దారుణం.. స్కూటీ డిక్కీ పగలగొట్టి నిమిషాల్లోనే

పట్టపగలు దారుణం.. స్కూటీ డిక్కీ పగలగొట్టి నిమిషాల్లోనే


పట్టపగలు దారుణం.. స్కూటీ డిక్కీ పగలగొట్టి నిమిషాల్లోనే

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. రద్దీగా ఉండే తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో అందరూ చూస్తుండగానే, కేవలం నిమిషాల వ్యవధిలో ఒక స్కూటీ డిక్కీని తెరిచి ఎనిమిది లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడు కళ్లముందే తన కష్టార్జితం దొంగల పాలవ్వడంతో కన్నీరుమున్నీరుగా విలపించాడు. తూముకుంట గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి అనే వ్యక్తి భూమి రిజిస్ట్రేషన్ కోసం ఎస్‌బీఐ (SBI) హైవే బ్రాంచ్ నుంచి రూ. 8 లక్షలు డ్రా చేశాడు. ఆ నగదును స్కూటీ డిక్కీలో పెట్టుకుని తహసిల్దార్ కార్యాలయానికి చేరుకున్నాడు. అయితే, బ్యాంకు వద్దే మాటు వేసిన ఇద్దరు దుండగులు అతడిని బైక్‌పై వెంబడించారు. నర్సింహారెడ్డి స్కూటీని ఆపి ఆఫీసు లోపలికి వెళ్లగానే, అదను చూసి డిక్కీ పగలగొట్టి నగదుతో పరారయ్యారు. ఒకరు నడుచుకుంటూ వెళ్లగా, మరొకరు బైక్‌పై వచ్చి అత్యంత వేగంగా ఈ చోరీకి పాల్పడ్డారు. ఈ తతంగమంతా అక్కడి సీసీ టీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల వద్దే ఇంతటి దారుణం జరగడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. భారీ మొత్తంలో నగదు తీసుకెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. జూన్‌ దర్శనం టికెట్ల కోటా విడుదల

Gold Price Today: తగ్గిన బంగారం, వెండిధర.. ఇవాళ తులం ఎంతంటే..!

FASTag: ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్

Mushroom: పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి..

గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *