కావాల్సిన పదార్ధాలు : బాగా పండిన జామకాయలు 3, పాలు 4 కప్పులు, ఒక కప్పు బెల్లం ముక్కలు, అర టీ స్పూన్ ఏలకుల పొడి, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, అర కప్పు జీడిపప్పు, ఒక కప్పు బాదం పప్పులు, కిస్మిస్ 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి.
పండిన జామకాయలను శుభ్రంగా కడిగి, నాలుగు భాగాలుగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. వీటిని రోటిలో కానీ, మిక్సీలో కానీ, వేసి నీరు పోస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత, దీనిని తీసుకుని వడపోసి గింజలను తొలగించి, జామ గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టి నాలుగు కప్పులు పాలు పోసి, అవి చిక్కబడే వరకు వాటిని బాగా మరిగించాలి
పాలు రంగు మారిన తర్వాత, దానిలో ముందుగా పక్కన పెట్టుకున్న జామకాయ పేస్ట్ ను వేసి, మీడియం మంట మీద ఈ మిశ్రమాన్ని కలుపుతూ 10 నిమిషాల పాటు బాగా ఉడికించాలి.
ఇది బాగా ఉడికిన తర్వాత బెల్లం లేక పంచదార, ఏలకుల పొడి, తురిమిన బెల్లం కూడా వేసి అది కరిగేపోయే వరకు స్టవ్ మీదే ఉంచండి. మళ్ళీ స్టవ్ వెలిగించి నెయ్యిలో జీడిపప్పు, బాదం, కిస్మిస్లను కూడా వేసి వేయించి, పాయసంలో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.
దీనిని మాత్రం అస్సలు మర్చిపోకండి. జామకాయ పాయసం చేసేటప్పుడు పాలు మంచివి అయ్యి ఉండాలి. అవి విరగకుండా ఉండేందుకు జామకాయ పేస్ట్ ను బాగా ఉడికించిన తర్వాత బెల్లం లేక పంచదారను వేస్తే టేస్టీగా ఉంటుంది.





